Iqra and Mulayam Love story: సీమా హైదర్‭కి ఒక న్యాయం, ఇక్రాకి మరొక న్యాయమా? లూడో ఆటతో చిగురించిన ప్రేమ.. ఇండియాకు వచ్చిన మరో పాక్ యువతి

తమకు భద్రత కావాలని ఎటువంటి విజ్ఞప్తి చేయనప్పటికీ, రబూపురాలోని సచిన్ ఇంటిపై నిరంతరం నిఘా ఉంచుతున్నారని ఉత్తరప్రదేశ్ పోలీసు సీనియర్ అధికారి తెలపడం గమనార్హం. సాధారణ దుస్తుల్లో పోలీసులు ఆ ప్రాంతాల్లో తిరుగుతున్నారట

Iqra and Mulayam Love story: సీమా హైదర్‭కి ఒక న్యాయం, ఇక్రాకి మరొక న్యాయమా? లూడో ఆటతో చిగురించిన ప్రేమ.. ఇండియాకు వచ్చిన మరో పాక్ యువతి

Seema and Iqra: పబ్‭జీ ఆటలో పరిచమైన సచిన్ మీనా(25) అనే వ్యక్తిని ప్రేమించి.. అతడి కోసం దేశ సరిహద్దు దాటి అక్రమంగా ఇండియాకి వచ్చిన పాకిస్తానీ మహిళ సీమా హైదర్(30) గురించి తెలిసిందే. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆమె గురించి చర్చ జరుగుతోంది. మీడియా సైతం ఈ విషయాన్ని బాగానే హైలైట్ చేస్తోంది. స్వయంగా ఆ జంట దగ్గరికి వెళ్లి ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. అయితే ఆమె పాకిస్తాన్ వచ్చినప్పటికీ, ఆమెను ఎంత మాత్రం శత్రు దేశానికి చెందిన మహిళా చూడడం లేదు. పైగా అతిథి వచ్చినట్టే భావిస్తున్నారు.

Uttar Pradesh : నచ్చినమ్మాయి కోసం టవరెక్కిన యువకుడు..పెళ్లి చేస్తే దిగుతా లేకుంటే దూకుతానని హల్ చల్

ఇకపోతే.. కొద్ది కాలం క్రితం ఇక్రా(25) అనే ఒక మహిళ ఇలాగే ఇండియాకు వచ్చింది. లూడో ఆడుతుండగా ఆమెకు ములాయం సింగ్ యాదవ్ (25)తో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. అతడిని పెళ్లి చేసుకునేందుకు ఆమె కూడా అక్రమంగా దేశ సరిహద్దు దాటింది. అయితే ఈమె విషయంలో మాత్రం పూర్తి భిన్న స్పందన వచ్చింది. ఇద్దరు వ్యక్తులు ఇండియాలోకి రావడానికి ముందు నేపాల్ వచ్చారు. అనంతరం అక్కడి నుంచి దేశంలోకి అక్రమంగా చొరబడ్డవారే. అయితే సీమాను కోడలిగా ఆహ్వానించగా, ఇక్రాను మాత్రం తిరిగి పాకిస్తాన్ కు పంపించారు.

Pakistan Politics: తన పార్టీ రద్దుపై కీలక వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

పెళ్లి కోసం ములాయం, ఇక్రా బెంగళూరుకు వచ్చారు. ఇక్రా తన పేరును రావా యాదవ్ గా మార్చుకుంది. పాకిస్థానీ మహిళ ఇక్రా భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు ఆమెతో సహా ములాయంను అరెస్ట్ చేశారు. తర్వాత ఫిబ్రవరి 19న వాఘా సరిహద్దు వెంబడి ఇక్రాను పాక్ అధికారులకు అప్పగించారు. ఇది జరిగిన తర్వాత సీమా ఘటన చోటు చేసుకుంది. అయితే సీమా విషయంలో కూడా ఇలాగే వ్యవహరిస్తారా అని ఒక సందర్భంలో పోలీసుల్ని ప్రశ్నించినప్పుడు.. ‘‘అది బెంగళూరు, ఇది యూపీ. ఇక్రాకు జరిగినట్టు సీమాకు జరగకపోవచ్చు’’ అని సమాధానం ఇచ్చారు.

NDA Meet: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కళ్లు తెరిచిన బీజేపీ.. ఎన్డీయే సమావేశానికి హాజరుకమ్మంటూ చిరాగ్‭కు ఆహ్వానం పంపిన నడ్డా

ఇక తమకు భద్రత కావాలని ఎటువంటి విజ్ఞప్తి చేయనప్పటికీ, రబూపురాలోని సచిన్ ఇంటిపై నిరంతరం నిఘా ఉంచుతున్నారని ఉత్తరప్రదేశ్ పోలీసు సీనియర్ అధికారి తెలపడం గమనార్హం. సాధారణ దుస్తుల్లో పోలీసులు ఆ ప్రాంతాల్లో తిరుగుతున్నారట. ఉత్తరప్రదేశ్ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, సీమ భవిష్యత్తుకు సంబంధించి తుది నిర్ణయం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రభుత్వానికి సచిన్ విజ్ఞప్తి చేస్తే సీమా భారత్‌లో ఉండేందుకు దీర్ఘకాలిక వీసా పొందవచ్చని పోలీసులు తెలిపారు. అంతే కాదు.. వారి వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు ఉంటే, సీమకు భారత పౌరసత్వం ఇవ్వాలని సచిన్ సంబంధిత శాఖకు విజ్ఞప్తి చేయవచ్చని కూడా సలహా ఇచ్చారు. ఒకే రకమైన రెండు కేసులు ముగింపు భిన్నంగా ఉంది.