NDA Meet: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కళ్లు తెరిచిన బీజేపీ.. ఎన్డీయే సమావేశానికి హాజరుకమ్మంటూ చిరాగ్‭కు ఆహ్వానం పంపిన నడ్డా

దివంగత మాజీ కేంద్ర మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ తనయుడైన చిరాగ్‌ పాశ్వాన్‌ను కేంద్ర కేబినెట్‌లోకి బీజేపీ చేర్చుకునే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి. అతని ప్రాణాలకు హాని ఉందని ఇటీవల, ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికలో వెల్లడి కావడంతో జెడ్ కేటగిరీ భద్రత కల్పించారు

NDA Meet: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కళ్లు తెరిచిన బీజేపీ.. ఎన్డీయే సమావేశానికి హాజరుకమ్మంటూ చిరాగ్‭కు ఆహ్వానం పంపిన నడ్డా

Nadda Letter to Chirag: జూలై 18వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో జరగబోయే నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ సమావేశానికి హాజరు కావాలంటూ లోక్ జనశక్తి పార్టీ (రాంవిలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్‭కు లేఖ రాశారు భారతీయ జనతా పార్టీ చీఫ్ జేపీ నడ్డా. వచ్చే లోక్‭సభ ఎన్నికలు లక్ష్యంగా ఎన్డీయే పక్షాల్ని బలోపేతం చేసి మరోసారి నరేంద్రమోదీని ప్రధాని చేయాలని కలమదళం ఈ మీట్ నిర్వహిస్తోంది. కాగా, మిత్ర పార్టీలకు పంపిన లేఖలో.. నరేంద్రమోదీ ప్రభుత్వ అభివృద్ధిలో, సంక్షేమంలో స్థానిక పార్టీలు కీలక పాత్ర పోషించాయని నడ్డా పొగడ్తలు కురపించారు.

Uttar Pradesh : 100 అడుగుల మొబైల్ టవర్ ఎక్కిన యువకుడు.. నచ్చిన అమ్మాయితో పెళ్లి చేయాలని డిమాండ్

అయితే ఇక్కడొక విషయం ప్రముఖంగా ప్రస్తావించాలి. 2020 అసెంబ్లీ ఎన్నికలు ముందు ఎన్డీయేతో జూనియర్ పాశ్వాన్(చిరాగ్ పాశ్వాన్) తెగతెంపులు చేసుకున్నారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‭తో బీజేపీ అంటకాగడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ విషయంలోనే ఎన్డీయే నుంచి బయటికి వచ్చారు. ఆ తర్వాత లోక్ జనశక్తి పార్టీని బీజేపీ రెండుగా చీల్చి వేసింది. అనంతరం చిరాగ్ బాబాయి పశుపతినాథ్ పారస్‭ను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. అయితే 2020 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు.. తండ్రి రాంవిలాస్ ద్వారా ఎల్‭జేపీకి ఏర్పడ్డ ఓటర్లంతా చిరాగ్ వెంటే ఉన్నారని తేలిపోయింది.

West Bengal: హత్య కేసులో జైలుకెళ్లిన ఆ ఇద్దరు ప్రేమలో పడ్డారు.. పెరోల్ మీద బయటికి వచ్చి పెళ్లి చేసుకున్నారు

దీంతో మళ్లీ చిరాగ్ పాశ్వాన్ తో సంధి చేసుకునేందుకు బీజేపీ చేతులు చాచింది. వాస్తవానికి కీలక సమయాల్లో బీజేపీకి చిరాగ్ మద్దతు ఇచ్చారు. తన పార్టీని చీల్చినప్పటికీ బీజేపీకి విశ్వాసంగా ఉంటూ వచ్చారు. అయితే తనకు జేపీ నడ్డా లేఖ పంపిన అనంతరం స్పందిస్తూ ‘‘పార్టీ నేతలతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటాం. వివిధ అంశాలపై బీజేపీకి ఎప్పటికప్పుడు మద్దతిస్తూనే ఉన్నాం. అయితే ఎన్డీయే సమావేశానికి వెళ్లాలా వద్దా అనే అంశంపై పార్టీ నేతలతో సమావేశమైన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని అన్నారు.

Revanth Reddy : బైబై కేసీఆర్ అంటూ ఉచిత కరెంట్‌పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు : రేవంత్ రెడ్డి

దివంగత మాజీ కేంద్ర మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ తనయుడైన చిరాగ్‌ పాశ్వాన్‌ను కేంద్ర కేబినెట్‌లోకి బీజేపీ చేర్చుకునే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి. అతని ప్రాణాలకు హాని ఉందని ఇటీవల, ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికలో వెల్లడి కావడంతో జెడ్ కేటగిరీ భద్రత కల్పించారు. కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ శుక్రవారం రాత్రి చిరాగ్ పాశ్వాన్‌తో వారంలో రెండోసారి సమావేశమయ్యారు. ఎన్డీయే సమావేశానికి హాజరు కావాలని చిరాగ్ పాశ్వాన్‌ను ఆహ్వానిస్తూ నడ్డా రాసిన లేఖను ఎల్‭జేపీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Pakistan Politics: తన పార్టీ రద్దుపై కీలక వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

ఇక ఎన్డీయే సమావేశానికి హాజరయ్యే జాబితాలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వర్గం కూడా ఉన్నాయి. బీహార్, ఉత్తరప్రదేశ్‌లోని చిన్న పార్టీలు, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలతో సహా అనేక కొత్త మిత్రపక్షాలు ఎన్డీయే సమావేశానికి హాజరు కాబోతున్నాయట. ఈ సమావేశానికి ప్రధాని మోదీ కూడా హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.