Dog Nanny Job : కుక్కను చూసుకునే ఉద్యోగం, రూ. కోటి జీతం .. లగ్జరీ ప్రైవేట్ జెట్‌లో ప్రయాణాలు,మరెన్నో సౌకర్యాలు

డాగ్ నానీ జాబ్. ఉద్యోగానికి సంవత్సరానికి కోటి రూపాయల శాలరీ. ప్రైవేట్ జెట్‌లో ప్రయాణాలు..సౌకర్యాలు మామూలుగా లేవు.

Dog Nanny Job : కుక్కను చూసుకునే ఉద్యోగం, రూ. కోటి జీతం .. లగ్జరీ ప్రైవేట్ జెట్‌లో ప్రయాణాలు,మరెన్నో సౌకర్యాలు

Dog Nanny Job

Updated On : June 29, 2023 / 12:11 PM IST

Dog Nanny Job In London : కుక్కను చూసుకునే ఉద్యోగం.. జీతం కూడా మామూలుగా లేదు. సంవత్సరానికి ప్యాకేజీ అక్షరాలా కోటి రూపాయలు. ఏంటీ షాక్ అయ్యారా..? శ్రీమంతుల కుక్కల రేంజ్ అలా ఉంటుంది. కుక్కకు కాపాల కాసే ఉద్యోగమేకదాని తేలిగ్గా తీసుకోవద్దు. ఆ ఉద్యోగికి ఆ కుక్క యజమాని కల్పించే సౌకర్యాలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. జీతానికి తగ్గట్లు, కుక్క రాజభోగానికి తగినట్లుగా సౌకర్యాలు కూడా ఉన్నాయి. దీంతో ఈ కుక్కను కాపలా కాసే ఉద్యోగానికి మంచి డిమాండ్ ఉంది.ఉద్యోగం దక్కించుకోవటానికి పోటీ కూడా ఉంది. అంతేమరి శ్రీమంతుల ఇంటిలో కుక్కలా..మజాకానా..?!

ఇంగ్లాండ్ రాజధాని లండన్‌లో జార్జ్ రాల్ఫ్-డన్, ఫెయిర్‌ఫాక్స్, కెన్సింగ్టన్‌లో ఒక బిలియనీర్‌ కు ఉన్న కుక్కల్ని చూసుకోవానికి ఉద్యోగ ఆఫర్ ప్రకటించాడు. ఆయనకున్న రెండు కుక్కల సంరక్షణ బాధ్యతలు చూసుకోవాలి అంటూ డాగ్ నానీ జాబ్ అన్నమాట. ఈ ఉద్యోగానికి సంవత్సరానికి కోటి రూపాయల శాలరీ ప్రకటించారు సదరు బిలియనీర్. ఉద్యోగికి సంవత్సరానికి ఆరు వారాలు సెలవులు ఉంటాయి. అంతేకాదు ఆ కుక్కలతో కలిసి ఎంచక్కా విమానం ప్రయాణాలు కూడా చేయొచ్చు. లగ్జరీ ప్రైవేట్ జెట్స్ లో గగన విహారం చేసే అవకాశం. అంతేకాదు మంచి వసతి, భోజన ఏర్పాట్లు ఉంటాయి. ఈ ఉద్యోగం అవసరమైనప్పుడు సంపన్నులతో మాట్లాడాల్సి ఉంటుంది.

woman Earns Lakhs per Day : చిన్నారులకు ఆటపాటలు నేర్పే ఉద్యోగం .. రోజుకు రూ.1.65 లక్షలు సంపాదిస్తున్న మహిళ

డాగ్ నానా జాబ్ చేయాల్సిన పనులేమంటే..కుక్కలకు సరైన సమయానికి ఆహారం పెట్టాలి. టైముకి డాక్టర్ వద్దకు చెకప్ లకు తీసుకెళ్లాలి. వాటిని శుభ్రంగా ఉంచాలి. స్నానం చేయించటం..వాకింగ్ కు తీసుకెళ్లటంతోపాటు వాటిని ఎప్పుడు ఉత్సాహంగా ఉంచాలి. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వ్యక్తులకు తప్పనిసరికిగా కుక్కల గురించి పైగా అవి మంచి మేలుజాతి కుక్కలు కాబట్టి వాటి గురించి క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. కుక్కలు తినే ఆహారం, తాగే పానీయాల గురించి అవగాహన కలిగి ఉండాలి.

కుక్కలతో చక్కటి అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఆకుక్కలే జీవితంగా ఉండాలి. మరి కోటి రూపాయల జీతం ఊరికే వస్తుందా ఏంటీ..అంతే మరి శ్రీమంతుల ఇంటిలో కుక్కల జీవితాలంటే అలాగే ఉంటాయి..