Boys And Girls Love : అబ్బాయిలూ ఇది మీకోసమే .. అమ్మాయిలు ఇష్టపడాలంటే మీరు ఎలా ఉండాలో తెలుసా

అమ్మాయి అబ్బాయిని ప్రేమించాలంటే ఏం చేయాలి..? ఎలాంటి అబ్బాయిల్ని అమ్మాయిలు ఇష్టపడతారు..? అబ్బాయిల్లో అమ్మాయిలకు ఎటువంటి క్వాలిటీస్ నచ్చుతాయి..? ప్రేమించటానికి అందం ఒకటే నిర్వచనమా..మానసిక నిపుణులు ఏం చెబుతున్నారు..

Boys And Girls Love : అబ్బాయిలూ ఇది మీకోసమే .. అమ్మాయిలు ఇష్టపడాలంటే మీరు ఎలా ఉండాలో తెలుసా

Boys and girls love relationship

Updated On : August 8, 2023 / 6:26 PM IST

Boys and girls love relationship : ప్రేమలో పడే విషయంలో అమ్మాయిలకు అబ్బాయిలకు చాలా తేడా ఉంటుందని మానసిన నిపుణులు చెబుతుంటాయి. అబ్బాయిలు ప్రేమలో పడినంత ఈజీగా అమ్మాయిలు పడరట. అమ్మాయిలకు చాలా కండిషన్స్ ఉంటాయి అబ్బాయిలను ఇష్టపడే విషయంలో.కానీ అబ్బాయిలు మాత్రం అమ్మాయి అందంగా ఉంటే చాలు ప్రేమలో పడిపోతారట. కానీ అమ్మాయిలు అలాకాదు తమకు కావాల్సిన క్వాలిటీస్ ఉంటేనే ఇష్టపడతారట. అబ్బాయిలు ఇలా ఉండాలి..అలా ఉండాలి అని కోరికలు అమ్మాయిలకు చాలా ఉంటాయి.అలా వారు కోరుకునే అబ్బాయి తారసపడే వరకు ఎదురు చూస్తారని మానసిక నిపుణులు చెబుతున్నారు

రోజుల మార్పులను బట్టి యువతీ యువకుల ఇష్టాలు..అభిరుచులు మారుతున్నాయి. మరీ ఈరోజుల్లో అమ్మాయిలు పురుషుల్లో ఎటువంటి క్వాలిటీస్ ఉండాలని కోరుకుంటున్నారో..వారు ఎటువంటి క్వాలిటీస్ ఉండే అబ్బాయిలకు ఎట్రాక్ట్ అవుతారో తెలుసుకుందాం..సో..అబ్బాయిలూ ఇది మీకోసమే..!!

అమ్మాయిలు కేరింగ్ నేచర్ ఉన్న అబ్బాయిలను ఎక్కువగా ఇష్టపడతారు. తమను బాగా చూసుకోవాలి. తమపై శ్రద్ధ చూపెట్టాలి. తమ ఇష్టాలు తెలుసుకునే అబ్బాయిలు దొరికితే అమ్మాయిలు వారితో త్వరగా ప్రేమలో పడిపోతారట. అంటే అబ్బాయిల్లో కేరింగ్ స్వభావం ఉంటే అమ్మాయిలు ప్రేమను పొందొచ్చన్నమాట. తాము ఎంతమందిలో ఉన్నా..తమతో ఎంతమంది కలిసి ఉన్నా..తనను మాత్రం నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు అనే భావన..నమ్మకం అబ్బాయిలు కలిగించాలి..దాన్ని కొనసాగించాలి.

అబ్బాయి అయినా అమ్మాయి అయినా తమ పార్టనర్ అందంగా ఉండాలని కోరుకుంటారు. అది సహజం కూడా. కానీ అమ్మాయిలు అందంతో పాటు అబ్బాయిల వ్యక్తిత్వాన్ని కూడా ఇష్టపడతారు. వ్యక్తిత్వానికే ప్రాధాన్యత ఇస్తారట. అబ్బాయిలు మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటే వ్యక్తిత్వం అమ్మాయిల ఇట్టే ఆకర్షితులు అవుతారట.

అలాగే తామను కేరింగ్ గా చూసుకోవటంతో పాటు కాస్త రొమాంటిగ్ గా ఉండాలనుకుంటారు అమ్మాయి. చిలిపి పనులు చేసే అబ్బాయిలంటే భలే లైక్ చేస్తారట. చిలిపితనం మాటున పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసినా హద్దుమీరి చపలత్వం ప్రదర్శించినా మొదటికే మోసం వస్తుంది. బ్రేకప్ తప్పదు. చిలిపిగా ఉండాలి తప్ప మొరటుగా ఉండకూడదు.

అబ్బాయిల రొమాంటిక్ స్వభావం మహిళలను చాలా బాగా ఆకర్షిస్తుంది. ఇది సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా చిలిపి సరదాలుగా ఉండేవారిని ఆడవారు ఇష్టపడతారు. అలాగే ప్రేమ అంటే కాస్త అజమాయిషి కూడా ఉంటుంది. దాన్ని అబ్బాయిలు అపార్థం చేసుకోకూడదు. ప్రేమ ఉంటే స్వార్థం కూడా ఉంటుంది.తను ప్రేమించిన అబ్బాయి తననే ప్రేమించాలనే స్వార్థం ఆడవారిలో ఉంటుంది. దాన్ని అపార్థం చేసుకోకూడదు. తమను మాత్రమే ప్రేమించే అబ్బాయిలను ఇష్టపడని అమ్మాయి ఉండరు. అలాగని అది ఎక్కువైనా ప్రమాదమే.

చిలిపితనం, చురుకుతనం, సమయస్ఫూర్తి, సెన్సాఫ్ హ్యూమర్ వంటి క్వాలిటీస్ తో పాటు మంచి వ్యక్తిత్వం ఉండే అబ్బాయిలకుక అమ్మాయిలు ఇట్టే పడిపోతారు. చిరుకోపాలు..చిరు కానుకలు ఇస్తే ఆమె మనససులో అబ్బాయిలు చెరగని ముద్రవేస్తారు. కానుక చిన్నదైనా ఇచ్చేదానిలో ప్రేమ ఉండాలి. ఆ కానుక ఇచ్చే తీరు నమ్మకాన్ని పెంచేదిగా ఉండాలి.

Viral Video: పసిబిడ్డ నుంచి 20 ఏళ్ల వరకు వారానికో ఫొటో.. ముద్దుల కూతురు ఎలా మారిందోనంటూ మురిసిపోయిన తండ్రి

అలాగే తమను గౌరవించే అబ్బాయిగా ఉండాలి. తన మనసెరిగినవాడై ఉండాలి. తన భావాలను అర్థం చేసుకోవాలి..తన మాటను గౌరవించాలి భావిస్తుంది. అటువంటి సున్నిత స్వభావం ఉన్న వ్యక్తిని చూడగానే అమ్మాయిలు తమ మనసును పారేసుకుంటారట.

ఏ అమ్మాయి అయినా కష్టపడి పనిచేసే అబ్బాయిలను ఇష్టపడతారు. తన భర్త బాగా సంపాదించాలి, ఎవరికీ చేయి చాపకూడదని ఆశిస్తుంది. తన భర్త గౌరవానికి భగం కలగకుండా ఉండాలని ఆశిస్తుంది. తమ కోసం ఏమి చేసినా జీవితంలో ఏదో సాధించాలని భావించే పురుషులకు మహిళలు చాలా త్వరగా పడిపోతారు.

తాము చెప్పేది పట్టించుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడే అబ్బాయిలంటే అమ్మాయిలు అంత దూరంలో పెడతారు. తమన పట్టించుకోకపోతే అమ్మాయిలకు అస్సలు నచ్చదు. అమ్మాయిలు చెప్పేదేంటో పూర్తిగా వినాలి.తరువాత అతని వర్షన్‌ ఏంటో చెప్పాలి. అంతే తప్ప చెప్పేది వినకుండా ఇష్టమొచ్చినట్లుగా నీకేం తెలీదు అంటూ అమ్మాయిలకు కాలుద్ది..తమను తక్కువగా చూస్తే అస్సలు నచ్చదు.

కానీ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎదుటివారి మాట వినాలి..పరిస్థితులను బట్టి ఒకరి మాట ఒకరు వినాలి. అప్పుడే ఆ బంధం కలకాలం కలహాలు లేకుండా ఉంటుంది.ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే ఆడా మగా అనే తేడా ఉండదు.నమ్మకంపైనే ఏంబంధమైనా నిలిచేది గెలిచేది..కొనసాగేది అని తెలుసుకోవాలి. నమ్మకమే ప్రేమకు పునాది..నమ్మకం ఉంటేనే వారి జీవితం సంతోషంగా సాగేది..