ATM Card: చనిపోయిన వ్యక్తి ATM కార్డ్‌తో డబ్బు తీస్తే శిక్ష పడుతుంది!
బ్యాంకింగ్ ప్రపంచంలో వేగంగా మార్పులు వచ్చేశాయి. ఇంతకు ముందు అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవాలన్నా.. వెయ్యాలన్నా బ్యాంకుల వద్ద బారులు తీరాల్సి వచ్చేది.

Debit Card
ATM Card: బ్యాంకింగ్ ప్రపంచంలో వేగంగా మార్పులు వచ్చేశాయి. ఇంతకు ముందు అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవాలన్నా.. వెయ్యాలన్నా బ్యాంకుల వద్ద బారులు తీరాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ATM కార్డ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌లు వచ్చేశాయి. కావల్సినప్పుడు ఏ ATM నుంచి సులభంగా డబ్బు తీసుకోవచ్చు.
అయితే, ఇటీవలికాలంలో ఎవరైనా కుటుంబ సభ్యుడు చనిపోతే, ఏటీఎమ్ ద్వారా బ్యాంకులో ఉన్న డబ్బులు తీసుకుంటున్నారు. బంధువు చనిపోయిన తర్వాత, అకౌంట్ నుంచి డబ్బు డ్రా చేయడానికి ప్రజలు ATM కార్డులను ఉపయోగించడం చూస్తూనే ఉన్నాం. ఈ పద్ధతి పూర్తిగా తప్పు అని చెబుతున్నారు. కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయిన తర్వాత అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవడం కరెక్ట్ కాదు. నామినీ అయినా కూడా ATM ద్వారా మరణించిన వారి అకౌంట్ నుంచి డబ్బు తీసుకోవడం నేరం అవుతుంది.
నామినీ మరణించిన వ్యక్తి డబ్బును క్లెయిమ్ చేసుకోవచ్చు:
ఎవరైనా వ్యక్తి మరణిస్తే, సదరు వ్యక్తి ఆస్తి మొత్తాన్ని మీ పేరు మీద బదిలీ చేయించుకున్న తర్వాతే ఆ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. చట్టప్రకారం, ఎవరైనా వ్యక్తి మరణించిన తర్వాత, అకౌంట్ నుంచి నుంచి డబ్బు విత్ డ్రా చెయ్యాలంటే, అకౌంట్ ఉన్న వ్యక్తి చనిపోయినట్లు బ్యాంకుకు తెలియజేయాలి. తర్వాత, నామినీకి సంబంధించిన మొత్తం ప్రక్రియ చేసి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. కానీ, అకౌంట్‌లో ఒకటి కంటే ఎక్కువ మంది నామినీలు ఉంటే మాత్రం.. నామినీలందరి నుంచి సమ్మతి లేఖను బ్యాంకుకు చూపించాలి.
నామినీ డబ్బును సులభంగా క్లెయిమ్ చేయవచ్చు. దీని కోసం, అతను బ్యాంకుకు వెళ్లి క్లెయిమ్ ఫారమ్ (బ్యాంక్ ఖాతాలో నామినీ క్లెయిమ్ మనీ) నింపాలి. దీనితో పాటు, అతను బ్యాంక్ పాస్‌బుక్, టిడిఆర్, ఎటిఎం, చెక్ బుక్, మరణించిన వారి మరణ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, విద్యుత్ బిల్లు, పాన్ కార్డ్ పత్రాలను సమర్పించాలి. దీని తర్వాత మరణించిన వారి అకౌంట్ మూసివేసి బ్యాంక్ మీకు సులభంగా డబ్బు ఇస్తుంది.
మరణించిన వ్యక్తి తన బ్యాంకు ఖాతాలో ఏ నామినీ పేరును నమోదు చేయకపోయినా వారసులు క్లెయిమ్ చేసుకోవచ్చు:
అకౌంట్‌లో డబ్బుని వారసులందరు సమానంగా పంచుకోవచ్చు. ఇందుకోసం వారసులందరూ తమ వారసత్వ ధృవీకరణ పత్రాన్ని చూపించాల్సి ఉంటుంది. బ్యాంక్‌లో ఫారమ్‌ను నింపేటప్పుడు, మరణించిన వ్యక్తి బ్యాంక్ పాస్‌బుక్, అకౌంట్ టీడీఆర్, ఎటీఎం, చెక్ బుక్, మరణించినవారి డెత్ సర్టిఫికేట్ సమర్పించాలి. దీంతో పాటు ప్రతి ఒక్కరూ తమ గుర్తింపు కార్డును కూడా చూపించాల్సి ఉంటుంది. దీని తర్వాత బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును చట్టబద్ధమైన వారసుడికి ట్రాన్స్‌ఫర్ చేస్తుంది బ్యాంకు.