Ari Mactans : ‘వాళ్లకు దెబ్బలు కావాలి నాకు డబ్బులు కావాలి’ మగవాళ్లను టార్చర్ చేసి భారీగా సంపాదిస్తున్న ముద్దుగుమ్మ

‘నాతో కొట్టించుకోవటం కొట్టించుకోవటం మీకిష్టమైతే మీరిచ్చే డబ్బులంటే నాకిష్టం’ అంటూ కొరడాలతో మగవాళ్ల ఒళ్లు వాయగొడుతోంది. అలా మగవాళ్లను టార్చర్ చేసి మరీ డబ్బులు భారీగా సంపాదిస్తోంది ఓ సుందరాంగి.

Ari Mactans : ‘వాళ్లకు దెబ్బలు కావాలి నాకు డబ్బులు కావాలి’ మగవాళ్లను టార్చర్ చేసి భారీగా సంపాదిస్తున్న ముద్దుగుమ్మ

England dominatrix Ari Aktans

England dominatrix Ari Aktans : చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు. కానీ అందాల సుందరాంగితో కొరడా దెబ్బలు కొట్టించుకున్నా ‘సమ్మ‘గా ఉందనుకుంటున్నారు కొంతమంది పురుషపుంగవు. అందుకే ఓ ముద్దుగుమ్మతో కొరడా దెబ్బలు కొట్టించుకుని మరీ డబ్బులిస్తున్నారు. ‘వాళ్లకు దెబ్బలు కావాలి నాకు డబ్బులు కావాలి’ అన్నట్లుగా ఓ మహిళ భారీగా డబ్బుల సంపాదిస్తోంది. ఇలా మగవాళ్లకు కిక్కు..ఆమెకు లక్కు అన్నట్లుగా ఉంది. మగవాళ్లను కొరడాలతో కొట్టి..బూతులు తిట్టి మరీ డబ్బులు సంపాదిస్తోంది.

భావోద్వేగాలు ఒక్కో మనిషికి ఒక్కోలా ఉంటాయి. రొమాన్స్ లో కూడా భావోద్వేగం అనేది ప్రధానమైనది సెక్సాలజిస్టులు చెబుతుంటారు. రొమాన్స్ లో భావోద్వేగాల కోసం కొంతమంది పురుషులు కట్టేసుకుని కొట్టించుకుంటారు. అదిగో అటువంటి ఫీలింగ్ కోసమే మగవాళ్లు ఓ అందాల సుందరాంగితో కొరడాలతో కొట్టించుకుని ఆనందపడిపోతున్నారు. ఇక ఆమె సంగతికొస్తే నాతో కొట్టించుకోవటం కొట్టించుకోవటం మీకిష్టమైతే మీరిచ్చే డబ్బులంటే నాకిష్టం అంటూ కొరడాలతో మగవాళ్ల ఒళ్లు వాయగొడుతోంది. అలా మగవాళ్లను టార్చర్ చేసి మరీ డబ్బులు భారీగా సంపాదిస్తోంది ఇంగ్లండ్ కు చెందిన ఓ సుందరాంగి.

hef Hat History : చెఫ్ పెట్టుకునే టోపీకి 100 మడతలు ఎందుకుంటాయి? ఆ టోపీ చరిత్ర తెలుసా?

కోరి కోరి తన వద్దకు వచ్చే మగవాళ్లకు కావాల్సినంత టార్చర్‌ చూపించి మరీ డబ్బులు సంపాదిస్తోంది. ఆ పేరు ‘అరి మక్తాన్స్ (Ari Mactans). ఉండేది సర్రేలోని ఫర్న్‌హామ్ (Surrey Farnham). అరి మక్తాన్స్. అందంగా ఉంటుంది. ఆకట్టుకునే రూపం. మగవాళ్లను సవాల్ చేసే కేర్ లెస్ ఆమెకు మరో ప్లస్ పాయింట్. ఆమె ఆహార్యం, బాడీ లాంగ్వేజ్ అంతా ఎగ్రెసివ్ గా ఉంటుంది. దీంతో మగవాళ్ల చూపంతా ఆమె మీదనే ఉంటుంది. దాన్నే క్యాష్ చేసుకునేందుకు ఉపయోగించుకుంటోంది మక్తాన్స్. మగవాళ్లను కొట్టి డబ్బులు సంపాదించటం వృత్తి(dominatrix)గా చేసుకుంది. వాళ్లకు కావాల్సింది దెబ్బలు..నాకు కావాల్సింది డబ్బులు అన్నట్లుగా కొరడాలతో మగవాళ్లను (ఇష్టపడి వచ్చినవాళ్లు) కొట్టి భారీగా డబ్బులు సంపాదిస్తోంది. అలా ఆమెతో కొరడాతో కొట్టించుకోవానికి పురష పుంగవులు క్యూకట్టి మరీ నిలబడుతున్నారు. డబ్బులిచ్చి మరీ కొట్టించుకుంటున్నారు.

డైలీ మెయిల్ న్యూస్ వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె ఒక డామినేట్రిక్స్ (dominatrix). అంటే శృంగార సమయంలో పురుషులను వేధించే మహిళ. ఆమె గంటకు 17 వేల రూపాయలు సంపాదిస్తోంది. కొరడా, బెల్ట్ ఇలా వారి వారి ఇష్ట ప్రకారం కొట్టటానికి ఉపయోగిస్తుంది. అంతేకాదు కొట్టేటప్పుడు బండబూతులు కూడా తిడుతుంది. అలా ఆమె కొట్టే దెబ్బలు సమ్మగా ఉన్నాయంటూ తెగ ఫీలైపోతున్నారు. ఒక్కో దెబ్బ మీద పడుతుంటే తియ్యగా మూలగటం..ఆమె తిట్టే బండ బూతులకు వావ్ వన్స్ మోర్ అంటూ తిట్టించుకుంటు..కొట్టించుకుంటు మరీ డబ్బులిస్తున్నారు.

Iran Hijab Bill : ఇరాన్‌లో హిజాబ్ తప్పనిసరి .. ఉల్లంఘిస్తే 10 ఏళ్లు జైలు శిక్ష,భారీ జరిమానా

తను ఇలా డబ్బులు సంపాదించటం గురించి అక్తాన్స్ మాట్లాడుతు..తన వద్దకు వచ్చే మగవాళ్లనే తాను టార్చర్ చేస్తానని అది వారి ఇష్టంతోనే వస్తారని తెలిపింది. అలా వారు ఇంట్లో పొందలేని విచిత్రమైన ఆనందాన్ని తను కొట్టే దెబ్బలద్వారా పొందుతుంటారని అలా చాలా మంది వైవాహిక జీవితాలు విచ్ఛిన్నం కాకుండా కాపాడానని చెబుతోంది. చాలా మంది పురుషులు తమ భాగస్వామి వ్యక్తం చేసే ప్రేమలో హింస ఉందనుకుంటారని..అందుకే వారు భార్యకు దూరంగా ఉంటారని చెప్పుకొచ్చింది.

తాను ప్రేమలోని హింసను వారికి అర్థమయ్యేలా చెప్పి…ఎంతోమంది కాపురాలు నిలబెడుతున్నానని చెబుతోంది. మక్తాన్స్ కు 19 ఏళ్ల వయస్సునుంచే ఈ పనిని వృత్తిగా చేసుకుందట. ఆమెకు 25 ఏళ్లు వచ్చేసరికి పూర్తి స్థాయి డామినేట్రిక్స్ (dominatrix)గా మారిందట. తనకున్న ఆ అనుభవంతో తన వద్దకు వచ్చే మగవాళ్లకు ఎటువంటి దెబ్బలు ఏ రేంజ్ లో కావాలో అర్థం చేసుకుని వారికి నచ్చేలా వీర బాదుడు బాదుతుందట.

అలా ఆమె నెలకు దాదాపు 20 మంది పురుషులను దెబ్బలు కొట్టి సంతృప్తిపరుతుందట. ఇక్కడ మరీ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే..తన వద్దకు దెబ్బలు కొట్టించుకోవటానికి వచ్చే మగవాళ్లతో ఆమె ఎటువంటి సంబంధాలు పెట్టుకోదు. కేవలం దెబ్బలు కొట్టటం వారిని దెబ్బల ద్వారా సంతృప్తిపరిచి పంపించటం వరకే. వారు ఆమెకు కష్టమర్లు. ఆమె దెబ్బలతో వారికి సంతృప్తిని ఇచ్చే ఓ వ్యక్తి.. అంతవరకే అంతే తప్ప వారితో ఆమె ఎప్పుడూ శారీరక సంబంధాలు పెట్టుకోదు. వారి వింత కోరికలను మాత్రమే నెరవేరుస్తుంది. అలా డబ్బుల సంపాదిస్తుంది.

Burqas Baned : బుర్ఖా వేసుకుంటే భారీ జరిమానా .. కొత్త చట్టం తెచ్చిన దేశం

ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఆమె వృత్తిని ఆమె బాయ్ ఫ్రెండ్ సపోర్ట్ చేస్తాడు. ఎంతోమంది ఎన్నో వ్యాపారాలు, వృత్తులు, ప్రవృత్తుల ద్వారా డబ్బులు సంపాదిస్తారు. ఆమెది ఇదో రకమైన వృత్తి అంటాడు ఆమె బాయ్ ఫ్రెండ్. ఆమె తన పాదాలతో పురుషుల ముఖాన్ని తన్నుతుంటుంది. ఈ తన్నుల కోసం పురుషులు ఆమె దగ్గరికి వస్తుంటారు.ఆమెతో కొరడాలతో కొట్టించుకుంటారు. అని చెబుతాడు అతను.