Haryana Trees Pension : చెట్లకు పెన్షన్ ప్రకటించిన హర్యానా ప్రభుత్వం .. ఎందుకో తెలుసా..?!
చెట్లను కాపాడేందుకు 'ప్రాణవాయు దేవత యోజన' కింద ఓ పథకాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం.

Haryana Govt Trees Pension
Haryana Govt Trees Pension : హర్యానా ప్రభుత్వం (Haryana Govt)వృక్షాలకు పెన్షన్ ప్రథకం (Trees Pension Scheme)ప్రకటించింది. మహా వృక్షాలను కాపాడేందుకు రూ.2,000,రూ.500 పెన్షన్ ప్రకటించింది. వృద్ధులను కాపాడినట్లు ఆ వృక్షాలను కాపాడుకోవాలని ప్రభుత్వం సూచించింది. చెట్లను కాపాడేందుకు హర్యానా ప్రభుత్వం ‘ప్రాణవాయు దేవత యోజన’ అనేపేరుతో ఓ పథకాన్ని తీసుకొచ్చింది.
అటవీ సంపద తరిగిపోతోంది. చెట్లను విచక్షణా రహితంగా నరకడంతో అడవులు బోసిపోతున్నాయి. రోడ్ల విస్తరణ పేరుతో మహావృక్షాలు కూలిపోతున్నాయి. పచ్చదనం కరువై కాలుష్యం పెరుగుతోంది. దీంతో హర్యానా ప్రభుత్వం (Haryana Govt) చెట్లను కాపాడేందుకు ‘ప్రాణవాయు దేవత యోజన’ కింద ఓ పథకాన్ని తీసుకొచ్చింది. 75 ఏళ్లు ఆ పై వయసున్న మహా వృక్షాలను కాపాడేందుకు కొత్త స్కీమ్ తెచ్చింది. ఈ వృక్షాలను కాపాడేవారికి సంవత్సరానికి రూ.2 వేల రూ.500 పెన్షన్‌గా తీసుకొచ్చింది.
వృద్ధులకు పెన్షన్ మాదిరే 70 ఏళ్లు పైబడ్డ పాత వృక్షాలకు పెన్షన్ ఇవ్వనున్నట్లు హర్యానా అటవీశాఖ మంత్రి కన్వర్ పాల్ గుర్జర్ (Environment Minister Kanwar Pal)తెలిపారు. పురాతన చెట్ల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వృక్షాలను గౌరవించాలన్న భావన ప్రజల్లో కలగాలన్నారు మంత్రి.
హర్యానా రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల 3 వందల అతిపురాతనమైన వృక్షాలు ఉన్నట్లు అటవీశాఖ గుర్తించింది. ఈ వృక్షాలన్నీ 75 ఏళ్లు పైబడ్డవే. ఈ పురాతన వృక్షాలను కాపాడేందుకు ‘ప్రాణవాయు దేవత యోజన’ ( Pran Vaayu Devta Pension Scheme)పథకాన్ని తెచ్చింది హర్యానా సర్కార్. ప్రభుత్వం తెచ్చిన ఈ పథకం పట్ల ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. చెట్లను రక్షించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని చెబుతున్నారు. చెట్లు లేకుంటే మానవ మనుగడే కష్టమంటున్నారు.
వృక్షాలు ప్రజలకు ఎన్నో రకాల మేలు చేస్తున్నాయి. చెట్లతో మనుషులకు ఎంతో రిలీఫ్ కలుగుతుంది. పక్షులు కూడా వృక్షాలపైనే గూళ్లు కట్టుకుని జీవనం సాగిస్తున్నాయి. మనుషులను కావాల్సినంత ఆక్సీజన్ చెట్ల నుంచే వస్తోంది. రావి, మర్రి, వేప వంటి వృక్షాలను ప్రజలు దైవంగా కూడా కొలుస్తారు. అందుకే వృక్షాలను కాపాడుకోవాలంటున్నారు జనం. చెట్లకు పెన్షనే కాదు మొక్కలు నాటాలని కూడా సూచించింది. నేటి మొక్కనే రేపటి చెట్లు అనే పిలుపుతో మొక్కలు నాటాలని సూచించింది. దీంట్లో భాగంగా గ్రామాల నుంచి నగరాల వరకు శివారు ప్రాంతాల్లో మొక్కలు నాటాలని సూచించింది.