Kota Goat : ఈ మేక బరువు 176 కిలోలు .. ధర అక్షరాలా రూ.12 లక్షలు!
అదో ప్రత్యేకమైన మేక..పేరు కింగ్. పేరుకు తగినట్లే దాని ధర కూడా వెరీ వెరీ స్పెషల్. ఆ మేక తినే ఆహారం ఏంటో తెలుసా..?

Kota Goat rs.12 lakhs
Madhya Pradesh Goat : ఓ మేక ధర ఎంతుంటుంది? మహా అయితే ఓ రూ.10వేలు ఉంటుంది. కానీ ఓ మేక ధర వింటే షాక్ అవ్వాల్సిందే. ఆ మేక ధర అక్షరాలా రూ.12 లక్షలు..!! ఏంటీ షాక్ అయ్యారా? అది ఓ మేక ధరా..? లేక మేకల మంద ధరా..? అని ఆశ్చర్యపోతాం. కానీ నిజమే అది ఒకే ఒక్క మేక ధర..!! లక్షల ధర పలికిన ఈ మేక కోటా జాతికి చెందినది. దాని పేరు ‘కింగ్’..పేరు తగినట్లుగా భారీగా ఉంటుంది. బలమైన ఆహార పెట్టి దాని యజమాని బాగా మేపటంతో ఏకంగా 176 కిలోలు పెరిగింది.
మధ్యప్రదేశ్‌లో కోటా జాతికి చెందిన ఓ మేక రూ.12 లక్షలకు అమ్ముడుపోయి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన సుహైల్ అహ్మద్ అనే వ్యక్తి ఎనిమిది నెలల క్రితం రాజస్ధాన్ లో ఈ కోటా జాతి మేకను కొన్నాడు. దానికి బలమైన ఆహారం పెట్టి బాగా మేపాడు. ‘కింగ్’ అనే పేరు పెట్టుకున్నాడు. పేరుకు తగినట్లే మంచి మంచి ఆహారం పెట్టటమేకాదు దానికి ప్రత్యేకించి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశాడు.
PM Modi : నా 25 ఎకరాల భూమిని మోదీకి రాసిస్తా.. 100 ఏళ్ల బామ్మ ప్రకటన
రోజూ శనగలు, గోధుమలు, పాలు, ఖర్జూరం, వంటి పదార్థాలనే ఆహారంగా ఇచ్చేవాడు. వేసవి వేడితో కింగ్ ఇబ్బంది పడకుండా కూలర్లు ఏర్పాటు చేశాడు. బలమైన ఆహారం తిన్న కింగ్ 176కిలోల బరువు పెరిగింది. కానీ ఎంత అపురూపంగా చూసుకుంటేనే..ఎంత బలవర్థక ఆహారం పెడితేనే..మేకలను..గొర్రెలను పెంచేది మాంసం కోసమే కదా..ఈ కింగ్ కూడా అంతే..వచ్చే బక్రీదు పండుగకు దీన్ని బేరం పెట్టాడు యజమాని. అలా ముంబైకు చెందిన ఓ వ్యక్తి ఈ కింగ్‌ను రూ.12లక్షలకు కొనేసాడు. దీంతో దాని యజమానికి ధర బాగా గిట్టటంతో తెగ సంతోషపడిపోతున్నాడు. తాను కింగ్ పై పెట్టిన పెట్టుబడికి లాభం బాగా వచ్చిందని సంతోషపడిపోతున్నారు.
Karnataka High Court : అలా చేస్తే హత్యాయత్నం కాదు.. కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు