Priyanka Gandhi Dance : ఎన్నికల ప్రచార రథంపై ప్రియాంక గాంధీ డ్యాన్స్‌ .. ఉత్సాహంతో ఊగిపోయిన కార్యకర్తలు

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక డాన్సులు వేశారు. లంబాడా మహిళలతో కలిసి డ్యాన్సులు వేశారు.

Priyanka Gandhi Dance : ఎన్నికల ప్రచార రథంపై ప్రియాంక గాంధీ డ్యాన్స్‌ .. ఉత్సాహంతో ఊగిపోయిన కార్యకర్తలు

Priyanka Gandhi lambada Dance

Updated On : November 25, 2023 / 2:41 PM IST

 

Priyanka Gandhi lambada Dance : తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ మంచి ఉత్సాహంగా ఉన్నారు. వరుస సభల్లో పాల్గొంటు అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు సంధిస్తున్నారు. రెండో రోజు తెలంగాణ ఎన్నికల్లో భాగంగా ఖమ్మం జిల్లాలో ప్రియాంక పర్యటిస్తున్నారు. దీంట్లో భాగంగా ప్రియాంక ప్రచార రథంపై ప్రయాణిస్తు డాన్సులు వేశారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి తుమ్మల నాగేశ్వర రావుతో పాటు మరికొంత మంది నేతు ప్రచారం రథంపై ఉన్నారు.

ఆ రథంపై ప్రియాంక గాంధీతో పాటు లంబాడా మహిళలు కూడా ఉన్నారు. పాలేరు నియోజకవర్గం లోని ఖమ్మం రూరల్ మండలం నాయుడు పేట లో ప్రియాంక గాంధీ రోడ్డు షోలో భాగంగా ప్రియాంక వేసిన డ్యాన్స్ వైరల్ అవుతోంది.  వారితో పాటు ప్రచారం రథంలో లంబాడా మహిళలు తమ సంప్రదాయ దుస్తుల్ని ధరించి..చేతిలో బిందెలు పట్టుకుని డ్యాన్సులు వేస్తు ప్రయాణించారు. అదే వాహంనపై ప్రయాణిస్తున్న ప్రియాంకా గాంధీ లంబాడా మహిళలతో కలిసి డ్యాన్సులు వేశారు.

ఆమె డ్యాన్స్ కు పొంగులేటి చప్పట్లు కొడుతు ఉత్సాహ పరిచారు. ప్రియాంక గాంధీ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైలర్ అవుతోంది. అత్యంత కోలాహలంగా జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె ఉత్సాహానికి ఊరేగింపులో కాంగ్రెస్ నేతలు..కార్యకర్తలు ఇనుమడించిన ఉత్సాహంతో కేరింతలు కొట్టారు.