Rahul Gandhi : తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రాహుల్ గాంధీ

మీరు చాలా అందంగా ఉన్నారు ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు..? రాహుల్ గాంధీకి ఎటువంటి ఆహారాలు ఇష్టం..? రాహుల్ గాంధీ చర్మ రక్షణ కోసం ఏం వాడతారు..? రాహుల్ రాజకీయ నాయకుడు కాకుంటే ఇంకేమి అయ్యేవారు..?

Rahul Gandhi : తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రాహుల్ గాంధీ

Rahul Gandhi IN Rajasthan

Updated On : October 11, 2023 / 11:05 AM IST

Rahul Gandhi : ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ పర్యటనలతో బిజీ బిజీగా ఉన్నారు. సామాన్యులతో కలిసిపోతు వారితో ముచ్చట్లు..వారి కష్ట సుఖాలు తెలుసుకుంటు సందడి సందడిగా గడుపుతున్నారు. కొన్ని రోజుల క్రితయం ఆయన రైల్వే కూలీలతో మాటా మంతీ కలిపారు. వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. సూట్ కేసులో మోసి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యారు. ఈక్రమంలో రాహుల్ గాంధీ రాజస్థాన్‌లో పర్యటిస్తు జైపూర్ మహారాణి కాలేజీ విద్యార్థినులతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా యువతులు రాహుల్ గాంధీ పర్సనల్ విషయాల గురించి ప్రశ్నించగా ఆయన ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. మీరు చాలా అందంగా ఉన్నారు ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు..? అంటూ ఓ విద్యార్దిని అడిగిన ప్రశ్నకు రాహుల్ చెప్పిన సమాధానం..మీ చర్మ రక్షణ కోసం ఏమేమి వాడతారు..? మీకు ఇష్టమైన ఆహారాలు ఏంటి..? అంటూ విద్యార్దినిలు ప్రశ్నలు వేయగా రాహుల్ చాలా ఉత్సాహంగా సమాధానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Assembly Eelections 2023: ఛత్తీస్‭గఢ్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? సర్వేలో ఆసక్తికమైన సమాధానం

మీరు చాలా అందంగా ఉంటారు, మరి పెళ్లి గురించి ఎందుకు ఆలోచించడం లేదు? అని ఓ యువతి వేసిన ప్రశ్నకు రాహుల్ ‘ తన పనులతో పాటు పార్టీ పనుల్లో కూడా బిజీగా ఉన్నారు పూర్తి సమయం కేటాయిస్తున్నాను అందుకే పెళ్లి గురించి ఆలోచించలేదు’’అంటూ సమాధానం చెప్పారు. అలాగే మీకిష్టమైన ఆహారాలు ఏంటీ అని మరో అమ్మాయి అడిగిన ప్రశ్నకు..‘‘ కాకరకాయ, బఠానీ, బచ్చలికూర తప్ప మిగతా అన్ని ఆహార పదార్థాలు తింటా’’అంటూ సమాధానమిచ్చారు. అలాగే మీకు ఏఏ ప్రదేశాలు అంటే ఇష్టం..? అని మరో అమ్మాయి అడిగిన ప్రశ్నకు ‘నేను వెళ్లని ప్రదేశాలన్నీ నాకిష్టమే’ అంటూ సింపుల్ గా సమాధానమిచ్చారు. మరో కొంటె అమ్మాయి అడిగిన కొంటె ప్రశ్న మీ చర్మ సంరక్షణ కోసం ఏం చేస్తారు? అని అడుగగా రాహుల్ నవ్వుతు ‘‘నేను సబ్బులు, క్రీమ్‌లు వాడను కేవలం నీళ్లతోనే ముఖం కడుక్కుంటా’’అని సమాధానమిచ్చారు.

మీరు రాజకీయ నాయకుడు కాకుంటే ఏమి అయ్యేవారు అంటూ మరో అమ్మాయి అడిగింది. దానికి రాహుల్ ‘‘నాకు చాలా విషయాలపై అవగాహన ఉంది..నేను టీచర్ గా పిల్లలకు చక్కటి పాఠాలు చెప్పగలను..వంట కూడా చాలా బాగా చేస్తాను..కాబట్టి రాజకీయ నాయకుడిని కాకపోతే ఏం చేసేవారు అనే ప్రశ్నకు సమాధానం చెప్పటం కష్టమే’అంటూ నవ్వేశారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఖతమ్… టాటా… బైబై అంటూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలు మీమ్స్ రూపంలో రావడం గురించి మాట్లాడుతు..ఈ ముచ్చట్లను త్వరగా ముగించాలని తన బృందం తనకు చెబుతోంది అంటూ చెప్పుకొచ్చారు. అలాగే కమ్యూనికేషన్ గురించి చెప్పుకొస్తు..కమ్యునికేషన్ అంటే అవతలి వ్యక్తిని లోతుగా అర్థం చసుకోవాలి..అవతని వ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడో ఎటువంటి మానసిక స్థితిలో ఉన్నాడో ..దేనికి భయపడుతున్నాడో..అతను ఏం కోరుకుంటున్నాడో అర్థం చేసుకోవటం అని వివరించారు.