6 year boy time table : ఆరేళ్ల పిల్లాడి టైమ్ టేబుల్ .. చదవుకోవటానికి టైమ్ ఎంతో తెలిస్తే నవ్వుకోవాల్సిందే..
ఆరేళ్ల పిల్లాడి టైమ్ టేబుల్ భలే ఉందిగా..తినటం, ఆడుకోవటం, చదువుకోవటం ఇలా దేనికి ఎంత టైమ్ పెట్టుకున్నాడంటే..

Six year Old boy time table
Sixi year Old boy time table : ఆరేళ్ల వయస్సున్న పిల్లలు ఏం చేస్తారు? స్కూలుకెళ్లతారు. ఇంటికొస్తారు హోం వర్క్ చేసి ఆడితే ఆటలు లేదంటే నిద్ర. అంతేకానీ రేపు ఉదయం లేచా ఏం చేయాలి? ఎన్నింటికి లేవాలి? స్నానం ఎంతసేపు చేయాలి? అమ్మ పెట్టిన బ్రేక్ ఫాస్ట్ ఎంతసేపు తినాలి? అని లెక్కలేసుకుంటారా ఏంటీ.. కానీ ఓ పిల్లాడు అందరిలా కాదే.. నేను డిఫరెంట్ అనేలా ఉన్నాడు.
ఓ పిల్లాడు తన రోజు వారీ టైమ్ టేబుల్ రెడీ చేసుకున్నాడు. ఎన్నింటికి లేవాలి? స్నానం ఎంతసేపు చేయాలి? అలా టైమ్ టేబుల్ రెడీ చేసుకున్నాడు. కానీ ఈ బుడ్డోడి టైమ్ టేబుల్ చూస్తే ఓరి పిడుగా..అనిపిస్తుంది. భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈ బుడ్డోడి టైమ్ టేబుల్… మరి ఏమేం రాసుకున్నాడు..దేనికి ఎంత టైమ్ కేటాయించుకున్నాడో తెలిసేసుకుందాం రండీ..
ఉదయం 9 గంటలకు నిద్ర లేచింది మొదలు ప్రతి పనికీ సమయం కేటాయించుకుని టైమ్ టేబుల్ రాసుకున్నాడు. బాగానే ఉందనుకుందాం.. కానీ చదువుకు మాత్రం చాలా తక్కువ టైమ్ పెట్టుకోవటం చూస్తే ఓరి పిడుగా అనిపిస్తుంది. చూసే వారికి నవ్వు తెప్పిస్తుంది.
బ్రేక్ ఫాస్ట్ కు అరగంట (9.30 To 10.00AM) కేటాయించుకున్నాడు. TV Time 10.00 Am To 11.00 Am, ఫైటింగ్ టైమ్ అంటూ ఓ గంట రాసేశాడు (11.30 to 2.30). మరి ఎవరితో ఫైట్ చేస్తాడో తెలియదు. బహుశా వాళ్ల నాన్నతో అయి ఉంటుంది. అలాగే స్నానానికి అరగంట కేటాయించుకున్నాడు. అదికూడా మధ్యాహ్నం 2.45 గంటల నుంచి 3.15 గంటల వరకు. ఇకపోతే చదువుకు మాత్రం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 2.45 గంటల వరకు అని రాసుకున్నాడు. అంటే కేవలం 15 నిమిషాలు. అంటే చదువుకు పెద్ద సమయం అవసరం లేదనుకుంటున్నట్టున్నాడీ బుడతడు..అలా లంచ్ టైమ్ స్లీపింగ్ టైమ్ అన్నీ రాసుకున్నాడు.