Tamilnadu : వీధికుక్క కోసం కుటుంబాన్నే వదిలేసిన వ్యక్తి .. తొమ్మిదేళ్లుగా దానితోనే జీవితం

పాపే నా ప్రాణం అనేది సినిమా.కానీ ఓ వ్యక్తి మాత్రం కుక్కే నా ప్రాణం అంటున్నాడు. ఆకుక్క కోసం కుటుంబాన్నే వదిలేసుకున్నాడు. అదికూడా ఓ వీధి కుక్క కోసం..తొమ్మిదేళ్లుగా ఆ కుక్కే లోకంగా జీవిస్తున్నాడు.

Tamilnadu : వీధికుక్క కోసం కుటుంబాన్నే వదిలేసిన వ్యక్తి .. తొమ్మిదేళ్లుగా దానితోనే జీవితం

man leaves family for stray dog

Updated On : June 26, 2023 / 4:20 PM IST

man leaves family for stray dog : వీధి కుక్కలు కనిపిస్తేనే ఆమడదూరం పారిపోతున్న పరిస్థితి. ఎక్కడ మీద పడి కరుస్తాయనే భయం. కానీ ఓ వ్యక్తి మాత్రం వీధి కుక్క కోసం తన కుటుంబాన్నే వదిలేసుకున్నాడు. ఈ వీధి కుక్క కావాలో మేం కావాలో తేల్చుకోమని కుటుంబ సభ్యులు వార్నింగ్ ఇచ్చారు. దీంతో సదరు వ్యక్తి కుటుంబం కంటే వీధి కుక్కే మిన్న అన్నట్లుగా ఏకంగా వీధి కుక్క కోసం సొంత కుటుంబాన్నే వదిలేసుకున్నాడు.

తొమ్మిదేళ్లుగా కుటుంబానికి దూరంగా వీధి కుక్కకు దగ్గరగా ఉంటున్నాడు. ఈ కుక్క అంటే తనకు ప్రాణమంటున్నాడు. తమిళనాడులో సుందర్ అనే వ్యక్తి కుక్క కోసం అదీ వీధి కుక్క కోసం కుటుంబాన్నే వదిలేసుకున్న ఘటన వెలుగులోకి రావటంతో అదికాస్తా వైరల్ గా మారింది. ఈ వీధికుక్క..వ్యక్తి స్నేహం కథ చర్చనీయాంశంగా మారింది.

Ujjain Man 28 Scissors : ఔరా.. ఒకేసారి 28 కత్తెర్లతో హెయిర్‌ కట్‌ చేస్తున్న హెయిర్‌ స్టయిలిస్ట్‌
అతని పేరు సుందర్. తిరునిండ్రవూర్ లోని ఓ ప్రైవేటు కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతనికి ఓ వీధి కుక్క దగ్గరైంది. దాదాపు ఏడాది వయస్సున్న ఆ కుక్కను ఇంటికి తెచ్చాడు. దానితోనే ఎక్కువగా సమయం గడుపుతున్నాడు. దానికి ‘బ్లాకీ’ అని పేరు కూడా పెట్టుకుని ముద్దుగా పెంచుకుంటున్నాడు. బ్లాకీకి కూడా సుందర్ అంటే ఎంతో ఇష్టం.అతన్ని వదిలి ఉండేది కాదు. కూడా కూడా తిరుతునే ఉండేది.సుందర్ చేతితో పెడితేనే అదే తింటుంది. అలా వారిద్దరి మధ్యా అనుబంధం బాగా పెరిగింది.

కానీ ఎప్పుడు ఆ కుక్కతోనే ఉండే సందర్ చూసి కుటుంబ సభ్యులు మందలించేవారు. కానీ సుందర్ మాత్రం బ్లాకీని వదిలి అస్సలు ఉండేవాడు కాదు. బ్లాకీ కూడా అంతే సుందర్ ను అంటిపెట్టుకునే ఉండేది. దీంతో సుందర్ కుటుంబ సభ్యులకు చిర్రెత్తుకొచ్చేది. బ్లాకీ మందలించేవారు. అదిచూస్తే సుందర్ అస్సలు ఊరుకునేవాడు కాదు. వారిపై కోప్పడేవాడు. దీంతో సుందర్ కుటుంబ సభ్యులకు బ్లాకీ అంటేనే చికాకొచ్చేది.

Haryana Trees Pension : చెట్లకు పెన్షన్ ప్రకటించిన హర్యానా ప్రభుత్వం .. ఎందుకో తెలుసా..?!

దాన్ని ఇంట్లోంచి పంపించేయమని సుందర్ కు చాలాసార్లు చెప్పారు. కానీ అతను అంగీకరించలేదు. అది ఇంట్లోనే ఉంటుందని తెగేసి చెప్పాడు. అలా బ్లాకీ గురించి ఇంట్లో గొడవలు పెరిగాయి. పంపించేయమని ఇంట్లోవాళ్లు. పంపించేది లేదని సుందర్. అలా గొడవలు పెరిగాయి. ఓ రోజున ఇంట్లో అందరు బ్లాకీని ఇంట్లోంచి పంపేయాల్సిందేనని తెగేసి చెప్పారు. అదన్నా ఉండాలి మేమన్నా ఉండాలి ఇంట్లోనే అనేకాడికి వచ్చారు.దీంతో సుందర్ బ్లాకీని వదులుకోలేక దాన్ని తీసుకుని ఇంట్లోంచి వచ్చేశాడు. అలా ఓ వీధి కుక్క కోసం కుటుంబాన్నే వదులుకున్న అతని కథ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.బ్లాకీని తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయాడు. తొమ్మిదేళ్ల నుంచి అతడు తన కుటుంబానికి దూరంగానే గడుపుతున్నాడు. అదే నా లోకం అని కుటుంబం కంటే బ్లాకీయే నాకు ముఖ్యం అంటున్నాడీ సుందర్..హా..అన్నట్లుగా బ్లాకీకి ఇప్పుడు పదేళ్లు. తొమ్మిదేళ్లుగా బ్లాకీతోనే సుందర్ జీవితం..