Gold Shop Robbery : బొమ్మలా నిలబడి బంగారం షాపులో చోరీ .. యువకుడు ఓవరాక్షన్‌తో ఏమైందంటే..
ఒక్కసారి బంగార షాపులో చోరీ చేశాక కుదురుగా ఉండకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఓ యువకుడు అడ్డంగా బుక్ అయ్యాడు.

Gold Shop Robbery man Mannequin actiing (1)
Gold Shop Robbery man Mannequin actiing : ఒక్కసారి బంగార షాపులో చోరీ చేశాక కుదురుగా ఉండకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఓ యువకుడు చేసిన పనికి అడ్డంగా బుక్ అయ్యాడు. బంగారం షాపులో బొమ్మలా బిగుసుకుపోయి నిలబడి అందరిని బొమ్మలా నమ్మించి చోరీ బాగానే చేశాడు. కానీ ఆ తరువాత చేసిన ఓవర్ యాక్షన్ తో అడ్డంగా బుక్ అయిన ఘటన పోలాండ్‌లోని వార్సా నగరంలో చోటుచేసుకుంది.
ఓ యువకుడు బంగారం షాపులో చోరీ చేయాలనుకుని షాపుకు వెళ్లి అక్కడ మెనాక్విన్ (మోడల్ కోసం ఏర్పాటు చేసే బొమ్మలు) లాగా నిలబడ్డాడు. షాపులో ఉండే బొమ్మలతో సమానంగా కదలకుండా మెదలకుండా నిలబడ్డాడు. పైగా చేతిలో ఓ చిన్న బ్యాగ్ కూడా పట్టుకుని బొమ్మలా నిలబడి చక్కగా మ్యానేజ్ చేశాడు. వేసిన ప్లాన్ కూడా బాగానే పనిచేసింది. షాపులోని కస్టమర్లు, సెక్యూరిటీ సిబ్బందీ ఎవరూ అతడిని గుర్తించలేదు. ఆఖరికి కెమెరాల కంట కూడా పడకుండా పర్ ఫెక్ట్ గా షాపు మూసే వరకు బొమ్మలాగనే నిలబడ్డాడు. షాపు క్లోజ్ చేశాక చేతిలో ఉన్న బ్యాగులో తనకు కావాల్సిన బంగారం సర్దేసుకున్నాడు. ఆనక అక్కడ నుంచి బయటపడ్డాడు.
Spain : అతనికి హార్ట్ ఎటాక్ వస్తే పోలీసుల్ని పిలిచారు.. కారణం ఏంటంటే?
అక్కడితో ఊరుకోకుండా ఓవర్ యాక్షన్ చేశాడు. బంగారం దోచేసి అక్కడినుంచి తిన్నగా వెళ్లకుండా ఓ రెస్టారెంట్ కు వెళ్లి సుష్టుగా తిన్నాడు. ఆ రెస్టారెంట్ మూసేవరకు అక్కడే ఉన్నాడు. ఇక రెస్టారెంట్ మూసివేస్తారనగా అక్కడనుంచి బయటకొచ్చాడు. అక్కడి వరకు బాగానే ఉంది. ఓ బట్టల షాపులో దూరాడు.అక్కడ కూడా తనకు కావాల్సిన బట్టల్ని దోచుకున్నాడు. ఆఖరికి తనకు ఒంటిమీదున్న పాత బట్టలు తీసివేసి షాపులో తనకు నచ్చిన డ్రెస్ ధరించాడు. కానీ అతని ఓవర్ కాన్ఫిడెంట్ కు చెక్ పెడుతు సెక్యురిటీకి అడ్డంగా దొరికిపోయాడు. బంగారం షాపులో కెమెరాలకు చిక్కకుడా అంతబాగా మ్యానేజ్ చేసిన ఆయుకుడు బట్టల షాపులో మాత్రం అటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. బహుశా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లేమో. సెక్యురిటీ సిబ్బంది అతడిని గుర్తించి పోలీసులకు ఫోన్ చేయటంతో అడ్డంగా దొరికిపోయాడు.
Pepper X : ప్రపంచంలో అత్యంత కారం కలిగిన మిర్చికి గిన్నిస్ రికార్డ్
పోలాండ్‌లోని వార్సా నగరంలో ఓ యువకుడు వినూత్న రీతిలో చేసిన చోరీలు ఆ తరువాత చేసిన మరో చోరీతో అడ్డంగా బుక్ అయిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బట్టల షాపులో చోరీ జరిగిందని దొంగను పట్టుకున్నామని సెక్యురిటీ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా బంగారం షాపులో చోరీ ఘటన కూడా బటయపడింది. అతను మరో షాపింగ్ సెంటర్‌లో కూడా ఇలాగే చోరీకి పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు. నిందితుడికి 10 ఏళ్ల వరకూ శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.