House Floating: నీటిపై ఇంటిని కిలోమీటర్ దూరం తరలించేశారు!!

సాంసారిక జీవితంలో ఇల్లు ఖాళీ చేసి ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లే ఉంటాం. కానీ, ఇంటినే ఒక చోటు నుంచి మరొక ప్రాంతానికి తీసుకెళ్లడం చూశారా.

House Floating: నీటిపై ఇంటిని కిలోమీటర్ దూరం తరలించేశారు!!

New Project (3)

Updated On : October 18, 2021 / 9:47 AM IST

House Floating: సాంసారిక జీవితంలో ఇల్లు ఖాళీ చేసి ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లే ఉంటాం. కానీ, ఇంటినే ఒక చోటు నుంచి మరొక ప్రాంతానికి తీసుకెళ్లడం చూశారా. ఇవి కూడా అరుదుగా జరుగుతుంటాయి. కానీ, నీటిపై తేలేలా ఏర్పాట్లు చేసి ఇంటినే తరలించేశారు ఈ కపుల్. కెనడాలోని న్యూ‌ఫౌండ్‌ల్యాండ్ లో గత వారం ఇదే జరిగింది.

రెండంతస్థుల బిల్డింగ్‌ను కిలోమీటర్ దూరం అవతల ఉన్న ఒడ్డుకు తరలించారు. హౌజ్ ఓనర్ డేనియల్ పెన్నీ ఆమె బాయ్ ఫ్రెండ్ కిర్క్ లావెల్ తో కలిసి అక్టోబర్ 11న 12బోట్ల సాయంతో నెట్టుకెళ్తూ.. కొత్త లొకేషన్ కు తీసుకెళ్లారు. ఈ మొత్తం ప్రక్రియకు దాదాపు 8గంటల సమయం పట్టిందని అధికారులు చెబుతున్నారు.

ఆ కిలోమీటర్ దూర ప్రయాణం ఉత్కంఠభరితంగా సాగింది. ఆ ఇల్లు నీటిలోకి జారగానే బోట్ డ్యామేజి అయిపోయింది. అదృష్టవశాత్తు మిగిలిన బోట్ల సపోర్ట్ దొరకడంతో ప్రమాదం తప్పింది. కొత్త ఒడ్డుకు రాగానే ఇద్దరు దానికి వాలును ఏర్పాటు చేసి పైకి లాగగలిగారు.

……………………………………….: రైతుల రైల్ రోకో.. నిరసనలు తీవ్రతరం!

గతంలో ఇల్లు కట్టిన ప్రదేశం.. సొంతది కాకపోవడంతో నీటి అవతల ఒడ్డు ప్రదేశానికి తరలించాలనుకుంది. ఆ ఇల్లు అంటే అమితమైన ప్రేమ ఉండటంతో దానిని వదులుకోలేక ఈ ప్రయత్నం చేసిందట. ఇంటికి కింద బ్యారెల్స్ ఏర్పాటు చేసి ఇల్లు మొత్తాన్ని మెటల్ ఫ్రేమ్ తో కట్టి పాత టైర్లతో తేలేలా చేశారు.