Biryani : ఇదేం బిర్యానీరా బాబూ .. టేస్ట్ నెక్ట్స్ లెవెల్ అట ..
ధమ్ బిర్యానీ, బొంగులో బిర్యాని,కుండ బిర్యాని ఇలా చాలా రకాల బిర్యానీల గురించి విన్నాం. కానీ కొత్తగా వచ్చిన ఈ బిర్యానీ చాలా వెరైటీగా ఉందే..

brick biryani
Biryani : ధమ్ బిర్యానీ, బొంగులో బిర్యాని,కుండ బిర్యాని ఇలా చాలా రకాల బిర్యానీల గురించి విన్నాం. టేస్ట్ కూడా చూసే ఉంటారు చాలామంది. అసలు హైదరాబాద్ అంటేనే విభిన్న రుచులకు మారు పేరు. ఇక బిర్యాని అంటే గుర్తుకొచ్చేది భాగ్యనగరమే. అటువంటి భాగ్యనగరంలో ఏ గల్లీకి వెళ్లినా వారి వారి స్టైల్లో బిర్యానీల ఘుమగుమలు రా రమ్మని పిలుస్తుంటాయి. అటువంటి హైదరాబాద్ లో ఓ బిర్యానీ నోరూరిస్తోంది. టేస్ట్ నెక్ట్స్ లెవెల్ అంటున్నారు తిన్నవారు. ధమ్ బిర్యానీ, బొంగులో బిర్యాని,కుండ బిర్యాని విని ఉంటారు. కానీ కొత్తగా ‘బ్రిక్ బిర్యానీ’(brick biryani) టేస్ట్ అద్దరగొట్టేస్తోందట. నాన్ వెజిటేరియన్స్ అయితే లొట్టలేసుకుని మరి బిర్యానీని లాగించేస్తున్నారట.
అకేషన్ ఏదైనా, ఇంటికి ఎవరు వచ్చినా, ఫ్రెండ్స్‌తో చిల్ అవ్వాలన్నా బిర్యానీ (biryani)మస్ట్. అందుకే బిర్యానీ లవర్స్ ను ఆకట్టుకునేందుకు ఒక్కో రెస్టారెంట్ బిర్యానీలో ఒక్కో ప్రయోగం చేస్తోంది. అలా ఇప్పటి వరకు దమ్ బిర్యానీ, బ్యాంబూ బిర్యానీ వంటి ప్రయోగాలు తెలుసు. ఇప్పుడు లేటెస్టుగా బ్రిక్ బిర్యానీ ( brick biryani )అందుబాటులోకి వచ్చింది. ఇటుక బిర్యానీ అంటే ఇటుక పొయ్యి మీద చేసే బిర్యానీ కాదండోయ్..ఇటుకలోనే బిర్యానీ చేస్తారు.
Chandrababu : ఒంటరిగానే పోటీ, బీజేపీతో పొత్తుకు టైమ్ దాటి పోయింది : చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
హా.. అదే మరి దీని స్పెషాలిటీ. ఇటుకతో తయారు చేసిన ఓ రెక్టాంగిల్ పాత్ర తీసుకుని.అదేనండీ ఇటుక ఆ యాంగిల్ లోనేగా ఉండేది. దాని అడుగున చక్కగా నెయ్యి రాసి బిర్యానీ వండుతారు. బిర్యానీకి అవసరమైన అన్ని రకాల మసాలా దినుసులు దట్టించి ఇటుకమీద మూత పెట్టి ఉడికిస్తే ఘుమఘుమలాడే బ్రిక్ బిర్యానీ రెడీ. ఎన్నో రకాల బిర్యానీలకు నెలవైన హైదరాబాద్ లో ఈ బ్రిక్ బిర్చాని నాన్ వెజ్ ప్రియులను పిచ్చెక్కిచ్చేస్తోందట. హైదరాబాద్ కొంపల్లిలోనే ఈ బ్రిక్ బిర్యానీ టేస్ట్ చూసేయొచ్చు. డిఫరెంట్ గా ఫుడ్ ట్రై చేసే ఆహార ప్రియులకు ఈ ఈ ఇటుక బిర్యానీ తెగ నచ్చేస్తోందట. టేస్ట్ చూసినవారు వావ్ వన్ మోర్ ప్లేట్ అంటున్నారట. టేస్ట్ నెక్ట్స్ లెవెల్ అంటున్నారట.
అవును మరి..ఫుడ్ బిజినెస్ లో రోజు రోజుకు పోటీ పెరుగుతున్న వేళ ఏదోక వెరైటీని చూపించాల్సిందే. వ్యాపారంలో నిలబడాలంటే పేరన్నా వెరైటీగా ఉండాలి..టేస్ట్ అయినా వెరైటీగా ఉండాలి. ఏం చేసినా..ఎలా చేసినా వెరైటీ అనేది మస్ట్. అటువంటి వెరైటీ ఈ బ్రిక్ బిర్యానీ. పేరు వింటే ఏదోలా ఉంది గానీ టేస్ట్ బాగుందంటు టాక్ ..