Ameer Log : రానా రిలీజ్ చేస్తున్న సినిమా.. అమీర్ లోగ్ రిలీజ్ ఎప్పుడంటే..?
తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ నిర్వహించి ఓ సాంగ్ రిలీజ్ చేసి, సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. (Ameer Log)
Ameer Log
Ameer Log : అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి బ్యానర్ పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అమీర్ లోగ్’. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా నటించగా వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి.. పలువురు కీలక పాత్రలు పోషించారు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్, కామెడీ సినిమాగా అమీర్ లోగ్ రానుంది. రానా దగ్గుబాటి ఈ సినిమాని తన ‘స్పిరిట్ మీడియా’ ద్వారా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ నిర్వహించి ఓ సాంగ్ రిలీజ్ చేసి, సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈ సినిమా ఆగస్ట్ 21న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
Also See : Sravanthi Chokarapu : పంజాబీ డ్రెస్‌లో ముక్కెరతో ముస్తాబయిన యాంకర్ స్రవంతి..
ఈ సినిమా ప్రెస్ మీట్ లో డైరెక్టర్ రమణా రెడ్డి సోమ మాట్లాడుతూ.. హైదరాబాద్ మనుషుల్ని తెరపై చూపించాలని అమీర్ లోగ్ తీశాను. స్పిరిట్ మీడియా టీంకి సినిమా నచ్చడంతో వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు. డబ్బులున్న వారు అమీర్ లోగా?, సంతోషంగా ఉండే వారు అమీర్ లోగా? అనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఆగస్ట్ 21న ఈ సినిమా రానుంది అని తెలిపారు. నిర్మాత మాధవి రెడ్డి మాట్లాడుతూ.. అమీర్ లోగ్ లో చూపించే బస్తీలోనే నేను పుట్టి పెరిగాను. అక్కడి నుంచి ఇక్కడి వరకు రావడానికి కారణం నా భర్త రమణా రెడ్డి అని తెలిపారు.

మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ సాయి మాట్లాడుతూ.. కల్చర్‌ను ప్రతీకగా తీసే సినిమాలంటే నాకు చాలా ఇష్టం. హైదరాబాద్‌ను, ఇక్కడి బస్తీలను రమణా రెడ్డి అద్బుతంగా క్యాప్చర్ చేశారు అని అన్నారు. నటుడు మనోజ్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో మనుషులు ఎలా ఉంటారు.. బిర్యానీ ఎలా ఉంటుంది.. క్రికెట్ అంటే ఎంత ప్యాషన్ ఉంటుంది అని ఎవరైనా అడిగితే అందరికీ అమీర్ లోగ్ సినిమా చూపించండి అని అన్నారు.
