Gold-Silver Prices Today : మహిళలకు గుడ్న్యూస్.. తగ్గిన బంగారం రేటు.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నేటి ధరలు ఇవే..
Gold-Silver Prices Today : గత వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేటు ఇవాళ (సోమవారం) తగ్గింది. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.

బంగారం కొనేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. ఇటీవల గోల్డ్ రేటు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో శని, శుక్రవారాల్లోనూ ధర భారీగా పెరిగింది. అయితే, ఇవాళ మాత్రం గోల్డ్ రేటు తగ్గింది.

సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.160 తగ్గగా.. 22క్యారెట్ల బంగారంపై రూ. 150 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 26డాలర్లు తగ్గగా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,357 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,55,680 వద్దకు చేరగా. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,42,700 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,55,830 కాగా.. 22క్యారట్ల బంగారం ధర రూ.1,42,850 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,55,680కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,42,700 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,60,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,55,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,60,000 వద్ద కొనసాగుతోంది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.
