Gold Silver Price Today : ఇరాన్లో మళ్లీ టెన్షన్.. బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు.. తులంపై ఎంత తగ్గిందంటే?
Gold Silver Price Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. ఇవాళ గోల్డ్ రేటు తగ్గింది.

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. హర్మూజ్ జలసంధిని తెరిచిన ఇరాన్ మళ్లీ మూసేసింది. దీంతో మళ్లీ ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు పెరిగాయి. మరోవైపు బంగారం ధరల్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి.

బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. గోల్డ్ రేటు తగ్గింది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ఉద్రిక్తతల నేపథ్యంలో గోల్డ్ రేటులో మార్పులు చోటు చేసుకున్నాయి.

సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 490 తగ్గగా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 450 తగ్గింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్‌పై 45 డాలర్లు తగ్గగా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,788 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది. దీంతో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,55,290 వద్దకు చేరగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,42,350 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,55,440కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,42,500 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,55,290కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ. 1,42,350 వద్ద కొనసాగుతుంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,80,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,75,000వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,80,000వద్దకు చేరింది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
