Google Pixel 9 Pro : ఫ్లిప్‌కార్ట్ ఖతర్నాక్ డీల్.. భారీగా తగ్గిన గూగుల్ పిక్సెల్ 9 ప్రో.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు!
Google Pixel 9 Pro : గూగుల్ పిక్సెల్ 9 ప్రో ధర తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభానికి ముందే ధర తగ్గింది.

Google Pixel 9 Pro : కొత్త పిక్సెల్ ఫోన్ కోసం చూస్తున్నారా? అతి త్వరలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం కానుంది. ఈ షాపింగ్ ఈవెంట్ ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, హోం అప్లియన్సెస్ వంటి వాటిపై భారీ డీల్స్, డిస్కౌంట్లను అందించనుంది.

బిగ్ బిలియన్ డేస్‌కు ముందే, ఫ్లిప్‌కార్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన గూగుల్ పిక్సెల్ 9 ప్రోపై భారీ తగ్గింపును అందిస్తోంది. పూర్తి ఆఫర్ వివరాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

పిక్సెల్ 9 ప్రో ఫ్లిప్‌కార్ట్ డీల్ : భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో రూ.1,09,999కు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ ప్రస్తుతం రూ.99,999కు లిస్ట్ అయింది. ఈ-కామర్స్ దిగ్గజం పిక్సెల్ 9 ప్రో ఫోన్‌పై రూ.10వేలు ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. మీ పాత స్మార్ట్‌ఫోన్ ట్రేడ్ చేయడం ద్వారా ఇంకా ఎక్కువ సేవింగ్ చేసుకోవచ్చు.

పిక్సెల్ 9 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : గూగుల్ పిక్సెల్ 9 ప్రో 6.3-అంగుళాల (LTPO) డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్‌నెస్ కలిగి ఉంది. అలాగే, డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 కవర్ గ్లాస్‌తో ప్రొటెక్ట్ చేస్తుంది. గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోన్ టెన్సర్ G4 చిప్‌సెట్‌తో వస్తుంది.

అంతేకాకుండా, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,700mAh బ్యాటరీతో వస్తుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. గూగుల్ పిక్సెల్ 9 ప్రో హ్యాండ్‌సెట్‌లో 50MP మెయిన్ కెమెరా, 48MP అల్ట్రావైడ్ సెన్సార్, 5x ఆప్టికల్ జూమ్‌తో 48MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఫోన్ ఫ్రంట్ సైడ్ 42MP కెమెరా కలిగి ఉంది.