India vs South Africa 2nd ODI: కుమ్మేసిన కుర్రాళ్లు.. రెండో వన్డేలో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం.. ఫొటో గ్యాలరీ
India vs South Africa 2nd ODI: దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో ఓటమి చవిచూసిన టీమిండియా.. రెండో వన్డేలో విజయం సాధించింది. రెండో వన్డేలో కుర్రాళ్లు కుమ్మేశారు. బౌలింగ్, బ్యాటింగ్ లో రాణించారు. తొలుత టీమిండియా బౌలింగ్ చేసింది. సిరాజ్ బౌలింగ్ ఈ మ్యాచ్‌లో హైలెట్ అనే చెప్పొచ్చు. సిరాజ్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి దక్షిణాఫ్రికా బ్యాటర్లకు కంగారెత్తించాడు. 10 ఓవర్లు వేసిన సిరాజ్ కేవలం 38 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. మిగిలిన బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో దక్షిణాఫ్రికా ఏడు వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా.. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ చెలరేగడంతో 279 పరుగుల లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. శ్రేయస్ సెంచరీతో అదరగొట్టగా.. ఇషాన్ 93 పరుగులు చేశాడు. బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణించడంతో రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించి సిరీస్ ను 1-1తో సమం చేసింది. నిర్ణయాత్మక చివరి వన్డే మంగళవారం ఢిల్లీలో జరగనుంది.






















