iQOO 15T Launch : కొత్త ఐక్యూ 15T అదుర్స్.. గేమింగ్, ఫొటోగ్రఫీ, బ్యాటరీ బ్యాకప్ అన్నీ ఒకే ఫోన్లో!
iQOO 15T Launch : ఐక్యూ నుంచి అద్భుతమైన ఫీచర్లతో ఐక్యూ 15టీ లాంచ్ అయింది. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

iQOO 15T Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? ఐక్యూ నుంచి సరికొత్త ఐక్యూ 15టీ వచ్చేసింది. ఈ ఫోన్ 6.82-అంగుళాల 2K డిస్ప్లేతో వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 మాన్స్టర్ ఎడిషన్ చిప్‌తో రన్ అవుతుంది.

ఈ ఫోన్ మెయిన్ హైలైట్ ఫీచర్ 200MP కెమెరా ఉంది. ఇందులో 8000mAh భారీ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16తో వస్తుంది. ఇతర ప్రత్యేక ఫీచర్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఐక్యూ 15టీ ధర, లభ్యత : ఐక్యూ 15T దేశీయ మార్కెట్లో లాంచ్ అయింది. ధర ఇంకా వెల్లడి కాలేదు. క్వింగ్‌యున్, ట్రాక్ ఎడిషన్, లెజెండ్ ఎడిషన్ అనే 3 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

ఈ ఫోన్ ముందుగా చైనా మార్కెట్లో లాంచ్ అయింది. గ్లోబల్ మోడల్ లాంచ్ సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు.

ఐక్యూ 15T స్పెసిఫికేషన్లు : కంపెనీ చైనా మార్కెట్లో ఐక్యూ 15T లాంచ్ చేసింది. ఈ ఫోన్లో 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 6.82 అంగుళాల భారీ డిస్ప్లే ఉంది. 2K రిజల్యూషన్ సపోర్ట్‌తో 8టీ ఎల్టీపీఓ డిస్ప్లే అందిస్తుంది. కంపెనీ ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 9500 మాన్స్టర్ ఎడిషన్ చిప్సెట్ అందిస్తుంది.

ఇందులో కంపెనీ సొంత క్యూ3 గేమింగ్ చిప్ కూడా ఉంది. 8GB నుంచి 16GB వరకు ర్యామ్ , 256GB నుంచి 512GB వరకు స్టోరేజ్ ఆప్షన్లతో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16తో వస్తుంది. దీనిపై ఒరిజిన్OS 6 స్కిన్ కూడా ఉంటుంది.

ఐక్యూ 15టీలో 200MP మెయిన్ కెమెరా ఉంది. శాంసంగ్ HP5 సెన్సార్‌తో వస్తుంది. 200MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ 8,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీతో వస్తుంది.

100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ 8.25mm మందం, 216 గ్రాముల బరువు ఉంటుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం కంపెనీ IP68, IP69 రేటింగ్ అందించింది.
