Nara Lokesh : విశాఖపట్టణంలో మంత్రి నారా లోకేశ్ సందడి.. ఫొటోలు వైరల్
Nara Lokesh : విశాఖపట్నంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటించారు. విశాఖలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 80వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి లోకేష్ ను కలిసేందుకు విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. వివిధ సమస్యలపై వారి నుంచి అర్జీలు స్వీకరించారు. అంతకుముందు 12వ అదనపు జిల్లా న్యాయస్థానానికి లోకేశ్ హాజరయ్యారు.


















