Motorola Edge 50 Pro : భలే ఆఫర్ భయ్యా.. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోపై కిర్రాక్ డిస్కౌంట్.. అమెజాన్ ఇలా కొన్నారంటే?

Motorola Edge 50 Pro : మోటోరోలా ఫోన్ ఏకంగా రూ. 13వేలు తగ్గింపు పొందింది. అమెజాన్ లో ఇలా కొన్నారంటే ఇంకా తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు.. అది ఎలాగంటే?

1/6Motorola Edge 50 Pro
Motorola Edge 50 Pro : కొత్త మోటోరోలా ఫోన్ కొంటున్నారా? ఇంటర్‌ఫేస్, స్ట్రాంగ్ డిజైన్, అద్భుతమైన కెమెరా, అదిరిపోయే పర్ఫార్మెన్స్ కలిగిన మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో అద్భుతమైన ఆప్షన్. ఈ మోటోరోలా ఫోన్ రూ. 13వేల కన్నా ఎక్కువ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ కలర్ డిస్‌ప్లే, ఆకర్షణీయమైన రోజువారీ పర్ఫార్మెన్స్, స్పీడ్ 125W ఛార్జింగ్‌తో వస్తుంది.
2/6Motorola Edge 50 Pro
ఈ ఫీచర్లతో ప్రీమియం వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. రోజువారీ పర్ఫార్మెన్స్, లాంగ్ బ్యాటరీ టాప్-అప్‌ ఆప్షన్లను అందిస్తుంది. మీరు ఈ మోటోరోలా ఫోన్ కోసం చూస్తుంటే ఈ లిమిటెడ్ టైమ్ డీల్ పొందవచ్చు. అమెజాన్‌లో మోటరోలా ఎడ్జ్ 50 ప్రో డీల్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/6Motorola Edge 50 Pro
అమెజాన్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ధర : ఈ మోటోరోలా ఫ్రో మోడల్ గతంలో రూ.35,999 ధరకు లాంచ్ కాగా ఇప్పుడు అమెజాన్‌లో చాలా తక్కువ ధరకు అమ్ముడవుతోంది. అసలు ధర నుంచి రూ.13,000 తగ్గింపు పొందింది. మీరు ఈ ఫోన్ కేవలం రూ.22,999కే పొందవచ్చు. స్కాపియా ఫెడరల్ బ్యాంక్, డీబీఎస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కార్డులతో వినియోగదారులు రూ.1,500 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.
4/6Motorola Edge 50 Pro
అదనంగా, ఇ-కామర్స్ రూ.1,115 నుంచి ఈఎంఐ ఆప్షన్ కూడా అందిస్తుంది. అలాగే, అప్‌గ్రేడ్ కోరుకునే కొనుగోలుదారులు పాత ఫోన్ బదులుగా రూ.21,750 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. అయితే, ఫోన్ వినియోగం, ఫోన్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.
5/6Motorola Edge 50 Pro
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్పెషిఫికేషన్లు : మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 6.7-అంగుళాల 1.5K pOLED స్క్రీన్‌ కలిగి ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 2,000 నిట్స్ బ్రైట్‌నెస్ లెవల్ అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 SoCతో వస్తుంది. 12GB ర్యామ్ వరకు, 256GB వరకు స్టోరేజీతో వస్తుంది. అదనంగా, 4,500mAh బ్యాటరీ కలిగి ఉంది. 125W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
6/6Motorola Edge 50 Pro
ఆప్టిక్స్ పరంగా మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. ఇందులో 50MP OIS ప్రైమరీ సెన్సార్, 13MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌కు సపోర్టు ఇచ్చే 10MP టెలిఫోటో సెన్సార్, 50MP సెల్ఫీ షూటర్ ఉన్నాయి.