Navratri-Durga Puja Festival 2025: దసరా వేడుకకు సిద్ధమవుతున్న భారత్.. భోపాల్, కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు, నాగ్‌పూర్ లో దుర్గమ్మ విగ్రహాల ఫొటోలు
Navratri-Durga Puja Festival 2025: నవరాత్రి 2025, దుర్గాపూజ ఉత్సవాలకు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. భోపాల్, కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు, నాగ్‌పూర్ లో దుర్గమ్మ విగ్రహాలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. దుర్గ నవరాత్రి పూజలకు దేశ ప్రజలు సిద్ధం అవుతున్నారు. (PC:ANI)

భోపాల్‌లో నవరాత్రి పండుగ వాతావరణం మొదలవుతోంది. కళాకారులు దుర్గమ్మ విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతూ పండుగ సందడిని మొదలుపెట్టారు. (PC:ANI)

కోల్‌కతాలో దుర్గాపూజా ప్రత్యేకత – ప్లాస్టిక్ సీసాలతో ఎకో-ఫ్రెండ్లీ పండాల్ అలంకరణ. కాలుష్య సమస్యపై సందేశం ఇస్తున్న కళాకారులు. (PC:ANI)

ఢిల్లీలో ఆరాంబాగ్ దుర్గాపూజా ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. కళాకారులు దుర్గమ్మ విగ్రహానికి తుది అలంకరణలు చేస్తున్నారు. (PC:ANI)

నాగ్‌పూర్‌లో దుర్గాపూజా కోసం విగ్రహాల అలంకరణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. కళాకారుల చేతుల్లో దుర్గమ్మ రూపం వెలుగుతోంది. (PC:ANI)

బెంగళూరులో దుర్గాపూజా కోసం కళాకారులు అమ్మవారి విగ్రహాలను అద్భుతంగా అలంకరిస్తున్నారు. పండుగ ఉత్సాహం నిండుతోంది. (PC:ANI)

భోపాల్‌లో నవరాత్రి పండుగకు ముందుగా దుర్గమ్మ విగ్రహానికి కళాకారులు మెరుగులు అద్దుతూ ఆధ్యాత్మిక వాతావరణం సృష్టిస్తున్నారు. (PC:ANI)

కోల్‌కతా కరీంపూర్‌లో దుర్గమ్మ విగ్రహానికి తుది అలంకరణలు. పండుగ శోభను మరింత పెంచుతున్న కళాకారుల శ్రమ. (PC:ANI)

కోల్‌కతాలో మహిళలు దుర్గాపూజా ఏర్పాట్లలో నిమగ్నమై పండుగ వాతావరణాన్ని కమ్మేస్తున్నారు. భక్తి, ఉత్సాహం పంచుతున్న దృశ్యం. (PC:ANI)