భక్తి తన్మయత్వంలో మునిగిపోయిన సారా అలీ ఖాన్.. ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తున్న ఫొటోలు.. చూశారా?
బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ మరోసారి ఆధ్యాత్మిక ప్రశాంతతను వెతుక్కుంటూ పవిత్ర కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. 2018లో తన తొలి చిత్రం 'కేదార్‌నాథ్' తో వెండితెరపై అడుగుపెట్టిన సారాకు, ఈ ప్రదేశంతో ఒక ప్రత్యేకమైన, భావోద్వేగపూరితమైన అనుబంధం ఉంది. ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి తీసుకున్న ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌పై అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. ఒక అభిమాని.. "నీకు కేదార్‌నాథ్‌తో ఉన్న అనుబంధం చాలా పవిత్రమైనది. పరమేశ్వరుడు ఎల్లప్పుడూ మీపై ఆశీర్వాదాలు కురిపించాలని కోరుకుంటున్నా" అని కామెంట్ చేశాడు.











