Vivo X300 Series : వావ్.. వివో నుంచి కిర్రాక్ ఫోన్ వస్తోందోచ్.. లాంచ్‌కు మందే కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే?
Vivo X300 Series : వివో అభిమానుల కోసం సరికొత్త వివో X300 ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ స్పెషిఫికేషన్లు, డిజైన్, కెమెరా ఫీచర్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Vivo X300 Series : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? అతి త్వరలో వివో X300 సిరీస్ భారత మార్కెట్లోకి రాబోతుంది. వివో ఫ్లాగ్‌షిప్ లైనప్‌ను విస్తరించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. లాంచ్‌కు ముందే వివో ఫోన్‌లను టీజ్ చేసింది. లాంచ్‌కు ముందే లీక్‌లు, పుకార్లు వస్తున్నాయి. భారత్‌లో అంచనా ధర, లాంచ్ తేదీ, డిజైన్ మార్పులు, కెమెరా అప్‌గ్రేడ్‌ల వరకు వివో X300 ఫోన్ సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వివో X300 స్పెసిఫికేషన్లు (అంచనా) : పాపులర్ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం.. స్టాండర్డ్ వివో X300 ఫోన్ 6.31-అంగుళాల 8T LTPO BOE డిస్‌ప్లే కలిగి ఉంటుంది. తక్కువ కాంతి వద్ద కూడా బ్రైట్‌నెస్ లెవల్స్ ప్రకాశవంతంగా ఉంటుంది. హుడ్ కింద, ఈ వివో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది. పర్ఫార్మెన్స్ భారీ ఫ్లాగ్‌షిప్ మోడ్ ద్వారా వస్తుంది.

ఆప్టిక్స్ పరంగా ఈ హ్యాండ్‌సెట్ 200MP శాంసంగ్ HPB ప్రైమరీ కెమెరా కలిగి ఉంటుంది. 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది. ఈ సెటప్‌లో APO పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్, టెలిఫోటో మాక్రో లెన్స్ కూడా ఉన్నాయి. ఇతర 3డీ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్పీడ్ డేటా కోసం హై-స్పెక్ USB పోర్ట్ ఉన్నాయి.

వివో X300 ప్రో ఫోన్ 6.78-అంగుళాల ఫ్లాట్ డిస్‌ప్లే, సన్నని బెజెల్స్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ రెండు మోడళ్ల మందం కేవలం 7mm మాత్రమే ఉండవచ్చు. మార్కెట్‌లోని అత్యంత సన్నని ఫ్లాగ్‌షిప్‌లలో ఇదొకటిగా నిలుస్తుంది.

భారత్‌లో వివో X300 లాంచ్ తేదీ, ధర (లీక్) : వివో X300 సిరీస్ అక్టోబర్ 13న చైనాలో లాంచ్ కానుంది. వచ్చే నవంబర్‌లో భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని పుకార్లు సూచిస్తున్నాయి. ధర లీక్‌లను పరిశీలిస్తే.. స్టాండర్డ్ వివో X300 దాదాపు రూ.69,900 నుంచి ఉంటుందని సూచిస్తున్నాయి.