24 గంటల్లోనే : జనసేనకి మరో షాక్

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చూసిన జనసేన పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. నేతలు జనసేనకు గుడ్ బై చెబుతున్నారు. నిన్ననే సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే

  • Publish Date - October 6, 2019 / 06:26 AM IST

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చూసిన జనసేన పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. నేతలు జనసేనకు గుడ్ బై చెబుతున్నారు. నిన్ననే సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చూసిన జనసేన పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. నేతలు జనసేనకు గుడ్ బై చెబుతున్నారు. నిన్ననే సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేనకు రాజీనామా చేశారు. ఇప్పుడు మరో మాజీ ఎమ్మెల్యే జనసేనకు గుడ్ బై చెప్పారు. గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య జనసేనకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను జనసేనాని పవన్ కి పంపారు. గత ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గం నుంచి చింతలపూడి పోటీ చేశారు.

పవన్‌ కల్యాణ్‌కు చింతలపూడి లేఖ రాశారు. గాజువాక నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, కార్యకర్తల కోరిక మేరకు తాను జనసేన పార్టీకి, పార్టీ ప్రాథమిక సభ్యత్యానికి రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో తెలిపారు. గత 15 ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్ట సుఖాలు పాలు పంచుకుంటూ ఎమ్మెల్యేగా పని చేసి… ప్రజలందరికి అనునిత్యం చేదోడు వాదోడుగా ఉన్నానని చెప్పారు. భవిష్యత్‌లోనూ రాజకీయంగా గాజువాక నియోజకవర్గంలో మాత్రమే ఉండాలని కార్యకర్తల, శ్రేయోభిలాషుల కోరిక మేరకు జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నానని వెంకట్రామయ్య తెలిపారు. 

చింతలపూడి వెంకటరామయ్య రాజీనామాతో గాజువాకలో జనసేన పార్టీ ఖాళీ అయినట్లే. జనసేన ఎన్నికల్లో ఘోర ఓటమి పాలయ్యాక కొన్ని రోజులుగా పలువురు సీనియర్‌ నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే రావెల కిషోర్‌బాబు, చింతల పార్థసారథి, మారంశెట్టి రాఘవయ్య, అద్దేపల్లి శ్రీధర్‌, డేవిడ్‌ రాజు, ఆకుల సత్యనారాయణ జనసేనకు గుడ్‌బై చెప్పారు. వీరి బాటలోనే మరికొందరు ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ  ఎన్నికల్లో జనసేన కేవలం ఒక్క సీటును మాత్రమే దక్కించుకోగలిగింది. ఎన్నికల ఫలితాల తర్వాత పలువురు నేతలు జనసేనను వీడుతున్నారు.