తెలంగాణలో నియంతను గద్దె దించాను- వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

బీజేపీని.. టీడీపీ, వైసీపీ ఏ విషయంలోనూ వ్యతిరేకించ లేదు. తెలుగు ప్రజలు బాగుండాలి కాబట్టే నేను కాంగ్రెస్ లో చేరాను.

YS Sharmila Sensational Comments On Opposition Parties

YS Sharmila : నేను ఎవరో వదిలిన బాణం కాదన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఏపీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించినందుకు సంతోషంగా ఉందన్నారు షర్మిల. రాహుల్ గాంధీని ప్రధాని చేయడం వైఎస్సార్ కల అని చెప్పారామె. వైఎస్సార్ కల సాకారం చేసేందుకు పనిచేస్తానన్నారు షర్మిల. మణిపూర్ వంటి ఘటనలతో బీజేపీ ఈ దేశానికి ప్రమాదకరం అని రుజువైందన్నారు. బీజేపీ వంటి రైటిస్ట్ పార్టీ అధికారంలో ఉంటే మణిపూర్ వంటి ఘటనలే జరుగుతాయన్నారు.

బీజేపీ ఏపీకి అన్యాయం చేసిందని షర్మిల ఆరోపించారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఏపీ ఎంతో అభివృద్ధి చెంది ఉండేదన్నారు. టీడీపీ, వైసీపీలు బీజేపీ తొత్తులు అని విరుచుకుపడ్డారు. బీజేపీతో ఈ పార్టీలకు కంటికి కనిపించని పొత్తులున్నాయ్ అని ఆరోపణలు చేశారు. టీడీపీ, వైసీపీ కుమ్మక్కయ్యాయి కాబట్టే బీజేపీ నిర్ణయాలకు మద్దతు పలుకుతున్నాయని విమర్శించారు షర్మిల. రాహుల్ గాంధీ ప్రధాని అయిన వెంటనే తొలి సంతకం ఏపీ ప్రత్యేకహోదా ఫైల్ మీదే ఉంటుందన్నారు.

Also Read : వైఎస్ షర్మిలను చంద్రబాబు తెచ్చుకున్నట్లు కనపడుతోంది- సజ్జల సంచలన వ్యాఖ్యలు

బీజేపీని టీడీపీ, వైసీపీ ఏ విషయంలోనూ వ్యతిరేకించ లేదన్నారు. ఏపీ ప్రజలే మాకు ముఖ్యం అని స్పష్టం చేశారు షర్మిల. కాంగ్రెస్ వల్ల, తన వల్ల ఏ పార్టీకి నష్టం జరుగుతుందో ప్రజలే చెబుతారని షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఎవరో వదిలిన బాణం కాదని తేల్చి చెప్పారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డ తెలంగాణలో ఒక నియంతను గద్దె దింపిందన్నారు షర్మిల.

”నేను నా స్వార్ధం చూసుకోలేదు. తెలుగు ప్రజలు బాగుండాలి కాబట్టే నేను కాంగ్రెస్ లో చేరాను. రీజనల్ పార్టీ నేతలు అధికారంలోకి వస్తే నియంతలే అవుతారని చరిత్ర చెబుతోంది. నాకు ఏపీ పుట్టినిల్లు. తెలంగాణ మెట్టినిల్లు. ఎవరికి ఎక్కువ భయం ఉంటే వారే నన్ను విమర్శిస్తారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాలు, 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది.

Also Read : ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల.. సీఎం జగన్‌పై నిప్పులు

ఈ నెల 23వ తేదీ నుంచి జిల్లాల వారీగా పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తా. 9 రోజుల పాటు రోజుకు మూడు జిల్లాల చొప్పున కార్యకర్తలతో మీటింగ్ ఉంటుంది. ఈ నెల 24 నుంచి ఏపీలో పోటీ చేసే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధుల నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తాం. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో మాణిక్కం ఠాకూర్ తొలి అప్లికేషన్ తీసుకుంటారు” అని షర్మిల తెలిపారు.

 

వైఎస్ షర్మిల కామెంట్స్..
* అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది.
* 25 నుంచి 30 నియోజకవర్గాల్లోనైనా గట్టిగా ఫోకస్ చేస్తాం.
* అందరం కష్టపడితే గెలుస్తాం.
* రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే నా కల.
* ఇందిరమ్మ రాజ్యం, రాజన్న రాజ్యం వేర్వేరు కాదు.
* చంద్రబాబు, జగన్ ఏపీకి ప్రత్యేక హోదా తేలేకపోయారు.
* రాహుల్ ప్రధాని అయ్యాక మొదటి సంతకం ప్రత్యేక హోదాపై చేస్తారు.
* జనవరి 23 నుంచి ఫిబ్రవరి 1 వరకు రాష్ట్రంలో పర్యటిస్తా.
* వైసీపీ, టీడీపీకి ఓటు వేస్తే బీజేపీకే పోతుంది.
* వైసీపీ, టీడీపీ ట్రాప్ లో ప్రజలు పడొద్దు.
* నేను జగన్ వదిలిన బాణాన్ని కాదు.
* ఎవరికి ఎక్కువ భయం ఉంటే వాళ్లే ఎక్కువ టార్గెట్ చేస్తారు
* అంత కష్టపడి కూడా తెలంగాణలో పోటీ చేయకుండా త్యాగం చేయడం వల్లే బీఆర్ఎస్ ఓడిపోయింది.
* ప్రాంతీయ పార్టీలు నాయకులు అధికారంలోకి వస్తే నియంతలే అవుతారు.
* ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదాం.

 

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు