చంద్రబాబును సీఎంను చేయడమే షర్మిల లక్ష్యంగా కనిపిస్తోంది- సజ్జల సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలకు ఏం తెలుసు? రాష్ట్రానికి, వైఎస్ఆర్ కుటుంబానికి కాంగ్రెస్ ఎంతో ద్రోహం చేసింది. జగన్ రెడ్డీ, నియంత అనడం.. ఈ భాష ఆశ్చర్యం కలిగిస్తోంది.

చంద్రబాబును సీఎంను చేయడమే షర్మిల లక్ష్యంగా కనిపిస్తోంది- సజ్జల సంచలన వ్యాఖ్యలు

Sajjala Ramakrishna Reddy Slams YS Sharmila

Sajjala Ramakrishna Reddy : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సీఎం జగన్ ను ఉద్దేశించి వైఎస్ షర్మిల చేసిన ఘాటు వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. వైఎస్ షర్మిలకు సజ్జల కౌంటర్ ఇచ్చారు. ఎదురుదాడికి దిగారు. షర్మిలను చూస్తే జాలి కలుగుతోందన్నారు సజ్జల. వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ ఎంతగా వేధించిందో అందరికీ తెలుసు.. అలాంటి పార్టీలో చేరగానే.. షర్మిల యాస, భాష మారాయి అని సజ్జల అన్నారు. తెలంగాణలో ఏం చేశారని ఏపీకి వస్తున్నారు? అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ ఆశయాలకు కట్టుబడి పని చేస్తున్న జగన్ ను ప్రజలు అక్కున చేర్చుకున్నారని సజ్జల అన్నారు.

Also Read : ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల.. సీఎం జగన్‌పై నిప్పులు

”రాష్ట్రంలో ఉనికిలేని పార్టీ కాంగ్రెస్‌. ఇన్నాళ్లు తెలంగాణలో ఏం చేశారు? ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? 119 స్థానాల్లో ఎందుకు పోటీ చేయలేదు? చూస్తుంటే వైఎస్ షర్మిలను చంద్రబాబు తెచ్చకున్నట్లు కనపడుతోంది. జగన్ రెడ్డీ అనడం..ఆ భాష చూస్తే ఆశ్చర్యమేస్తుంది. షర్మిల వాడిన భాష సరికాదు. తెలంగాణలో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి.. ఇక్కడ అవకాశం లేదు పొమ్మంటే.. వైఎస్ షర్మిలను ఏపీలో నేను ఉపయోగించుకుంటా అని చంద్రబాబు తెచ్చుకున్నట్లు కనపడుతోంది. షర్మిల వ్యాఖ్యలు మా అందరికీ బాధ కలిగించాయి. కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలకు ఏం తెలుసు? రాష్ట్రానికి, వైఎస్ఆర్ కుటుంబానికి కాంగ్రెస్ ఎంతో ద్రోహం చేసింది. జగన్ రెడ్డీ, నియంత అనడం.. ఈ భాష ఆశ్చర్యం కలిగిస్తోంది” అని వాపోయారు సజ్జల రామకృష్ణారెడ్డి.

షర్మిలకు సజ్జల కౌంటర్..
* షర్మిల వాడిన భాష సరికాదు
* వైఎస్ఆర్ కుటుంబానికి కాంగ్రెస్ ఎంతో ద్రోహం చేసింది
* చంద్రబాబు, కాంగ్రెస్ కలిసి జగన్ పై అక్రమ కేసులు బనాయించారు
* నిన్నటివరకు తెలంగాణలో షర్మిల ఏం చేశారు?
* ఇప్పుడు ఏపీకి షర్మిల ఎందుకు వచ్చినట్లు?
* షర్మిలను చంద్రబాబు తెచ్చుకున్నట్లు కనపడుతోంది
* చంద్రబాబును సీఎంను చేయడమే షర్మిల లక్ష్యంగా కనిపిస్తోంది
* చంద్రబాబు కుట్రలో షర్మిల ఒక అస్త్రం
* షర్మిలను పావులా వాడుకోవాలని చూస్తున్నారు
* రాష్ట్రాన్ని కాంగ్రెస్ అడ్డగోలుగా విభజించింది
* చేసిన తప్పులకు కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకుంది
* ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆరోజు చట్టంలో ఎందుకు పెట్టలేదు?
* కాంగ్రెస్ చేసిన తప్పులకు వైసీపీని షర్మిల నిలదీయడం ఏంటి?
* ఏపీలో ఉనికి లేని పార్టీ కాంగ్రెస్
* గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు నోటాకన్నా తక్కువ ఓట్లు వచ్చాయి
* ఏపీలో కాంగ్రెస్ కు జీవం పోయడం సాధ్యం కాదు
* కేంద్రంలో ఎవరున్నా ఏపీకి మేలు జరగాలనేది జగన్ ఆలోచన
* ఏ మతం వారికి అన్యాయం జరిగినా జగన్ సహించరు