టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. రాజధాని టూర్ లో చంద్రబాబు సామాజిక వర్గాల ప్రస్తావరన తెచ్చారని తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు అమరావతి పర్యటనపై బొత్స సెటైర్లు వేశారు. రాజధాని టూర్ లో చంద్రబాబు సామాజిక వర్గాల ప్రస్తావరన తెచ్చారని తెలిపారు. గురువారం (జనవరి 2, 2020) విశాఖలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ రాజధాని గ్రామాల పర్యటనలో చంద్రబాబు సామాజిక వర్గాల ప్రస్తావన తీసుకరావడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
విశాఖలో కేపిటల్ పెట్టినా బాగుపడేది చంద్రబాబు సామాజిక వర్గమేనని అన్నారు. అమరావతి భూ సమీకరణలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించారు. అమరావతిలో టీడీపీ నేతలు ఇన్ సైడింగ్ ట్రేడింగ్ పాల్పిడింది ముమ్మాటికి నిజమన్నారు. పేదలను భయపెట్టి తక్కువ రేట్లకు భూములు కొన్నారని విమర్శించారు.
రాష్ట్ర విభజన తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఐదేళ్లలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని బొత్స ఆరోపించారు. చంద్రబాబు రాష్ట్రాన్ని 25 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని విమర్శించారు. రాష్ట్ర విభజనకు టీడీపీ అనుకూలమని చెప్పింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తర్వాత సీనియర్‌ను, అనుభవం ఉన్న వ్యక్తినని అవకాశం ఇవ్వాలని చంద్రబాబు అడిగారని.. దాంతో ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చారని బొత్స తెలిపారు.
ఒక టౌన్ షిప్ నిర్మిస్తే సంపద వస్తుందా అని బొత్స నిలదీశారు. ఆ ప్రాంతంలో భూముల ధరలు పెరిగితే పెరిగి ఉండొచ్చు.. కానీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయా అని ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబును చూసి బయపడేవారని చంద్రబాబు అన్నారు.. ఏ విషయంలో, దేనికి బయపడ్డారో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పట్లో చంద్రబాబు మంత్రి అవ్వడానికి రాజశేఖర్ రెడ్డే కారణమని బొత్స సత్యనారాయణ తెలిపారు.
అమరావతిలో బుధవారం పెద్ద డ్రామా జరిగిందని అన్నారు. చంద్రబాబు దంపతులు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చి అమరావతిలో రైతుల ఆందోళనలో పాల్గొన్నారని విమర్శించారు. నారా భువనేశ్వరి ఇవ్వాల్సింది గాజులు కాదు.. కొట్టేసిన భూములు అన్నారు.