Balineni Srinivasa Reddy : పంతం నెగ్గించుకున్న బాలినేని శ్రీనివాస రెడ్డి, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Balineni Srinivasa Reddy : ఏకంగా సీఎం జగన్ ను కలిసి చర్చించారు బాలినేని. సీఎం జగన్ తో భేటీ తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. తాజాగా ఒంగోలు డీఎస్పీ బదిలీని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. దీంతో బాలినేని పంతం నెగ్గిందంటున్నారు ఆయన అనుచరులు.

Balineni Srinivasa Reddy

Balineni Srinivasa Reddy : ఒంగోలు డీఎస్పీ నియామకం విషయంలో మాజీమంత్రి, ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. వివాదాస్పదంగా మారిన ఒంగోలు డీఎస్పీ నియామకాన్ని నిలుపుదల చేసి అశోక్ వర్ధన్ రెడ్డిని దర్శికి బదిలీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read..Gone Prakash Rao : ఏపీలో టీడీపీ, జనసేన కలిస్తే 150 సీట్లు పక్కా.. లేకపోతే 100 సీట్లు

ఇటీవల ఒంగోలు డీఎస్పీగా అశోక్ వర్ధన్ రెడ్డిని నియమించారు. అయితే, డీఎస్పీగా అశోక్ నియామకం విషయంలో తనతో చర్చించలేదని, కనీసం సంప్రదించలేదని బాలినేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ఆయన మండిపడ్డారు. బాలినేని అలకబూనారు. ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఈ విషయమై సీఎం జగన్ ను కలిసి చర్చించారు బాలినేని. సీఎం జగన్ తో భేటీ తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. తాజాగా ఒంగోలు డీఎస్పీ బదిలీని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. దీంతో బాలినేని పంతం నెగ్గిందంటున్నారు ఆయన అనుచరులు.

Also Read..Gone Prakash : భారతి కోసమే షర్మిళ, విజయమ్మను దూరంగా పెట్టిన జగన్ : గోనే ప్రకాశ్