జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కి గట్టి షాక్ తగిలింది. కీలక నేత జనసేనకు రాజీనామా చేశారు. మారిశెట్టి రాఘవయ్య జనసేనకి గుడ్ బై చెప్పారు. పార్టీకి, పదవులకి ఆయన రిజైన్ చేశారు.
జనసేన పార్టీకి గట్టి షాక్ తగిలింది. కీలక నేత జనసేనకు రాజీనామా చేశారు. మారిశెట్టి రాఘవయ్య జనసేనకి గుడ్ బై చెప్పారు. పార్టీకి, పదవులకి ఆయన రిజైన్ చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు పవన్ కి పంపారు. జనసేన, ప్రజారాజ్యం పార్టీల్లో రాఘవయ్య కీలకంగా వ్యవహరించారు. ఆయన రాజీనామా చెయ్యడం పార్టీకి గట్టి దెబ్బగా ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
మారిశెట్టి రాఘవయ్య సీనియర్ నేత, జనసేన కోశాధికారిగా ఉన్నారు. వ్యక్తిగత కారణాలతో పార్టీలోని అన్ని పదవులను వదులుకుంటున్నట్టు రాజీనామా లేఖలో రాఘవయ్య తెలిపారు. ఎన్నికల ఫలితాలు రాక ముందే నాయకుల వరుస రాజీనామాలు జనసేన పార్టీలో కలకలం రేపుతున్నాయి.
ఎప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్న వారిని పట్టించుకోకుండా, కొత్తగా వచ్చిన వారికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారని.. సీనియర్ నేతలు వెళ్లిపోవడానికి అదే కారణం అని వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీతో జనసేన రహస్య ఒప్పందం నచ్చకనే రాఘవయ్య రాజీనామా చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. మారిశెట్టి రాఘవయ్య ప్రజారాజ్యం పార్టీలోనూ కీలకంగా వ్యవహరించారు. జనసేన అధికార ప్రతినిధి అద్దెపల్లి శ్రీధర్ ఇప్పటికే పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రాఘవయ్య దూరమయ్యారు. జనసేనలో జరుగుతున్న పరిణామాలు పార్టీ శ్రేణుల్లో ఆందోళన నింపాయి.