Chikoti Praveen(Photo : Google)
Chikoti Praveen On Politics : కేసినో కింగ్ గా గుర్తింపు పొందిన చీకోటి ప్రవీణ్ త్వరలో రాజకీయాల్లోకి రానున్నారా? అంటే, అవుననే సమాధానం వస్తోంది. త్వరలో రాజకీయ అరగేట్రం చేస్తాను అని స్వయంగా చీకోటి ప్రవీణ్ చెప్పారు. పాలిటిక్స్ లోకి ఎంట్రీపై త్వరలో ప్రకటన చేస్తాను అన్నారు. తాను రాజకీయాల్లోకి రాకుండా కొందరు తనపై రూమర్స్ చేస్తున్నారని చీకోటి ప్రవీణ్ ఆరోపించారు.
థాయ్ ల్యాండ్ గ్యాంబ్లింగ్ కేసులో చికోటి ప్రవీణ్ ఇవాళ విచారణకు హాజరయ్యారు. నకిలీ సర్టిఫికెట్స్ తో నాకు ఇన్విటేషన్ పెట్టారని ఆయన ఆరోపించారు. అది తెలుసుకుని థాయ్ ల్యాండ్ న్యాయస్థానం తమకు 2వేల బాత్ లు(థాయ్ కరెన్సీ) ఫైన్ విధించిందన్నారు. జరిమానా కట్టి తామంటా బయటకు వచ్చామన్నారు. ఇక, టీడీపీ నేత పట్టాభి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు చీకోటి ప్రవీణ్.
పట్టాభికి అధికారం లేక పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని ఎదురుదాడికి దిగారు. లగ్జరీ కార్ల కొనుగోలు అంశంపై ప్రస్తుతం ఐటీ శాఖ దర్యాప్తు చేస్తోందన్నారు. ఈడీ ప్రశ్నలకు సమాధానం చెప్పాను అన్నారు. తాను రాజకీయాల్లోకి రాకుండా ఇలాంటి రూమర్స్ చేస్తున్నారని ఆయన చెప్పారు. దర్యాప్తు సంస్థ ఈడీ మీద మాకు పూర్తి నమ్మకం ఉందన్నారు ప్రవీణ్. మళ్ళీ ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని చెప్పారని చీకోటి ప్రవీణ్ వెల్లడించారు.