డబ్బులిచ్చి చెప్పులు, రాళ్లతో దాడులు చేయించారు : వైసీపీ నేతలపై చంద్రబాబు ఫైర్

వైసీపీ నేతలు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు డబ్బులు ఇచ్చి మూకలను తీసుకొచ్చి తమపై దాడులు చేయించారని విమర్శించారు.

  • Publish Date - February 27, 2020 / 11:05 AM IST

వైసీపీ నేతలు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు డబ్బులు ఇచ్చి మూకలను తీసుకొచ్చి తమపై దాడులు చేయించారని విమర్శించారు.

వైసీపీ నేతలు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు డబ్బులు ఇచ్చి మూకలను తీసుకొచ్చి తమపై దాడులు చేయించారని విమర్శించారు. గురువారం (ఫిబ్రవరి 27, 2020) విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ డబ్బులు ఇచ్చి తమపై చెప్పులు, వాటర్ బాటిళ్లు, రాళ్లతో దాడి చేయించారని ఆరోపించారు. పులివెందుల రాజకీయాలు విశాఖలో చేయాలని చూస్తున్నారని విమర్శించారు. సైకోలా ప్రవర్తిస్తూ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని మండిపడ్డారు.

విశాఖ పర్యటనకు ముందుగానే పోలీసుల అనుమతి తీసుకున్నామని చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘించను..సహకరిస్తామని చెప్పానని తెలిపారు. వెనక్కి వెళ్లిపోవాలని పోలీసులు ఇప్పుడు చెబుతున్నారని అన్నారు. నన్ను ఏ చట్టం ప్రకారం వెనక్కి వెళ్లమంటున్నారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న తనపైన దాడులు చేయిస్తున్నారని వాపోయారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు బెదిరించడం సరికాదన్నారు. విశాఖ ప్రశాంతమైన నగరం.. ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని తెలిపారు. విశాఖలో భూకబ్జాలు జరిగాయన్నారు. 6 వేల అసైన్డ్ భూములను లాక్కునే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. మీరు తప్పులు చేయనప్పుడు తనను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు.

చంద్రబాబును అరెస్టు పోలీసులు చేశారు. ఆయన్ను విశాఖ ఎయిర్ పోర్టులోకి తరలిస్తున్నారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు..బై బై..బాబు, గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ..సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఉత్తరాంధ్రలో 2020, ఫిబ్రవరి 27వ తేదీ గురువారం పర్యటించేందుకు బాబు యత్నించారు. దీనిని అడ్డుకుంటామని ముందునుంచే వైసీపీ చెబుతూ వస్తోంది.

గురువారం ఎయిరో పోర్టులో దిగినప్పటి నుంచి బాబుకు నిరసన సెగ తగిలింది. భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు మోహరించి..బాబు కాన్వాయ్‌కి అడ్డు తగిలారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా..టీడీపీ శ్రేణులు పోటీగా నినాదాలు చేశారు.