అమరావతికి ముంపు వచ్చింది : చివరికి ధర్మమే గెలుస్తుంది

ఏపీ రాజధాని అంశంపై రగడ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాకే అని సీఎం జగన్ అనౌన్స్ చేసిన కాసేపటికే..

  • Publish Date - February 5, 2020 / 07:55 AM IST

ఏపీ రాజధాని అంశంపై రగడ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాకే అని సీఎం జగన్ అనౌన్స్ చేసిన కాసేపటికే..

ఏపీ రాజధాని అంశంపై రగడ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాకే అని సీఎం జగన్ అనౌన్స్ చేసిన కాసేపటికే.. టీడీపీ చీఫ్ చంద్రబాబు స్పందించారు. బుధవారం(జనవరి 5,2020) తుళ్లూరులో అమరావతి రాజధాని కోసం ఆందోళనలు చేస్తున్న రైతులకు చంద్రబాబు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.

అమరావతికి వరద ముప్పు ఉందని అసత్య ప్రచారాలు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం వచ్చాకే అమరావతికి ముంపు వచ్చిందన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. మూడు రాజధానులంటే నిర్వహణ వ్యయం పెరుగుతుందన్నారు. అమరావతి రాజధాని కోసం 39మంది రైతులు చనిపోయారని చంద్రబాబు వాపోయారు. రాజధానిని అమరావతిలో మాత్రమే కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మూడు రాజధానులంటూ జగన్ తుగ్లక్ లా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. యావత్ దేశం.. రాజధాని రైతులకు సంఘీభావం తెలుపుతుంటే.. వైసీపీ నేతలు మాత్రం మూడు రాజధానులు అంటూ వితండవాదం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాత్కాలిక ఇబ్బందులు ఎదురైనా.. చివరికి ధర్మమే గెలుస్తుందని చంద్రబాబు చెప్పారు.

రాజధానిపై చంద్రబాబు కామెంట్స్:
* అమరావతికి వరదలు వస్తాయని ప్రచారం చేశారు
* అమరావతిలోనే రాజధాని కొనసాగిస్తామనే వరకు పోరాడుతాం
* తుళ్లూరు రైతులకు చంద్రబాబు సంఘీభావం
* 50వ రోజు కొనసాగిస్తున్న రైతుల ఆందోళనలు
* జగన్ నిర్ణయాలతో రూ.40వేల కోట్ల పెట్టుబడులు వెనక్కి పోయాయి

* వైసీపీ ప్రభుత్వం వచ్చాకే అమరావతికి ముంపు వచ్చింది    
* రాజధానికి వరదలు వస్తాయని అసత్య ప్రచారం చేశారు
* డబ్బుల్లేవని సీఎం జగన్ అబద్దాలు చెబుతున్నారు
* రాజధాని కోసం 39మంది రైతులు చనిపోయారు

* రాష్ట్రమంతా ఒకే సామాజిక వర్గం ఉందా?
* అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా ఉండాలని అమరావతిని ప్రారంభించా
* మనకు సహకరించేందుకు సింగపూర్ ప్రభుత్వం కూడా ముందుకొచ్చింది
* అమరావతిని ప్రారంభించడం నేను చేసిన తప్పా?
* దేశం మొత్తం అమరావతికి జై కొడుతున్నా.. మన తుగ్లక్ మాత్రం మారడం లేదు
* రాజధాని రైతుల పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది