ఏపీ ఎన్నికల ప్రచారంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. చంద్రబాబు, జగన్ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఏపీని అభివృద్ధి
ఏపీ ఎన్నికల ప్రచారంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. చంద్రబాబు, జగన్ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఏపీని అభివృద్ధి చేసింది నేనే అని చంద్రబాబు అంటే.. మాయ మాటలతో మోసం చేశారు అని జగన్ అంటున్నారు. అనంతపురంలో కొలువుదీరిన కియా మోటార్స్ విషయంలో జగన్, చంద్రబాబు మధ్య మాటల యుద్ధం జరిగింది. కియా మోటార్స్ ఏపీకి తెచ్చింది ప్రధాని మోడీ అని జగన్ అంటే.. కాదు నేనే అని చంద్రబాబు అంటున్నారు.
అనంతపురం జిల్లా మడకశిరలో ఎన్నికల ప్రచారంలో కియా మోటార్స్ గురించి జగన్ ప్రస్తావించారు. కియా మోటార్స్ ను తెచ్చింది తానేనని చంద్రబాబు చెప్పుకుంటున్నారని, వాస్తవంగా కియా మోటార్స్ ను ఏపీకి తెచ్చింది ప్రధాని నరేంద్ర మోడీ అని జగన్ అన్నారు. ప్రధాని వల్లే కియా అనంతపురానికి వచ్చిందని చెప్పారు. కియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు భూకుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. కియా మోటార్స్ రాకముందే అనంతపురంలో రైతుల నుంచి భూములు తీసేసుకున్నారని అన్నారు. చంద్రబాబు పాలనలో ఒక్క కంపెనీ కానీ, పెట్టుబడి కానీ ఏపీకి రాలేదన్నారు.
Read Also : కేజ్రీవాల్ కు బాబు రూ.50 కోట్లిచారట: ఇదో లెక్కా అంటున్న వైసీపీ
సీఎం హోదాలో ఇచ్చిన హామీలను కూడా చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు. నిరుద్యోగులు, రైతులు, డ్వాక్రా మహిళలందరినీ మోసం చేశారంటూ జగన్ మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు అందరినీ మోసం చేశారని, 6వేల స్కూళ్లు మూతపడ్డాయని ఆరోపించారు.
జగన్ ఆరోపణలకు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడారు. కియా మోటార్స్ ను ఏపీకి తీసుకొచ్చింది తానేనని స్పష్టం చేశారు. కొరియాకు చెందిన ప్రపంచ స్థాయి కార్ల తయారీ సంస్థ కియాను గుజరాత్ తీసుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోడీ చూశారని, కియా యాజమాన్యం మోడీని కాదని తనను నమ్మి ఏపీలో పెట్టుబడులు పెట్టిందని చంద్రబాబు వివరించారు. ”కియా మోటార్స్ ను అనంతపురం తీసుకురావడానికి నేను చాలా ప్రయత్నించాను. మోడీ కూడా కియాను గుజరాత్ తీసుకెళ్లడానికి రంగంలోకి దిగారు. కియా ప్రతినిధులపై ఒత్తిడి పెంచారు. కియా ప్రతినిధులు నన్ను నమ్మారు కానీ మోడీని నమ్మలేదు. అందుకే కియా ఏపీలో అడుగుపెట్టింది” అని చంద్రబాబు తెలిపారు.
Read Also : సందట్లో సడేమియా : ప్రచారంలో షర్మిళ ఉంగరం చోరీ యత్నం