వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని స్పీకర్ ఆదేశం

చంద్రబాబు మాటల్లో అన్ పార్లమంటరీ పదాలు ఉన్నాయని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఇలాంటి పదాలు పార్లమెంటరీ వ్యవస్థకు మంచిదికాదన్నారు.

  • Published By: veegamteam ,Published On : December 13, 2019 / 06:26 AM IST
వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని స్పీకర్ ఆదేశం

Updated On : December 13, 2019 / 6:26 AM IST

చంద్రబాబు మాటల్లో అన్ పార్లమంటరీ పదాలు ఉన్నాయని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఇలాంటి పదాలు పార్లమెంటరీ వ్యవస్థకు మంచిదికాదన్నారు.

చంద్రబాబు మాటల్లో అన్ పార్లమంటరీ పదాలు ఉన్నాయని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యల్లో అన్ పార్లమంటరీ లాంగ్వేజ్ ఉందని తెలిపారు. ఇలాంటి పదాలు పార్లమెంటరీ వ్యవస్థకు మంచిదికాదన్నారు.

చంద్రబాబు తాను ఆ మాటలు అనలేదన్నారని… కానీ ఆయన అన్నట్లు వీడియో ఆధారాలున్నాయని తెలిపారు. ఆవేశంతో ఎవరైనా మాట్లాడతారని.. వాటిని ఉపసంహరించుకుంటే గౌరవంగా ఉంటుందన్నారు. అసెంబ్లీలో హుందాగా వ్యవహరించాలని సూచించారు.

మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఆ మాటలు అనకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. బయటి వ్యక్తులు శాసనసభలోకి వచ్చినట్లు ఆరోపణలున్నాయని తెలిపారు. విచారణ చేయాల్సిందిగా పోలీసులను ఆదేశిస్తున్నట్లు తెలిపారు. సభ్యులు కాని వారు అసెంబ్లీ ఆవరణలోకి వచ్చినట్లు గుర్తిస్తే క్రిమినల్ కేసులు పెట్టాలని స్పీకర్ ఆదేశించారు.