సీఎం జగన్ కీలక నిర్ణయం

పాలనపరంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం జగన్.. మరో కీలక డెసిషన్ తీసుకున్నారు. రాష్ట్ర ప్రణాళికా బోర్డు రద్దు దిశగా అడుగులు వేస్తున్నారు. దాని స్థానంలో నాలుగు

  • Publish Date - August 22, 2019 / 06:11 AM IST

పాలనపరంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం జగన్.. మరో కీలక డెసిషన్ తీసుకున్నారు. రాష్ట్ర ప్రణాళికా బోర్డు రద్దు దిశగా అడుగులు వేస్తున్నారు. దాని స్థానంలో నాలుగు

పాలనపరంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం జగన్.. మరో కీలక డెసిషన్ తీసుకున్నారు. రాష్ట్ర ప్రణాళికా బోర్డు రద్దు దిశగా అడుగులు వేస్తున్నారు. దాని స్థానంలో నాలుగు ప్రాంతీయ ప్రణాళికా బోర్డుల ఏర్పాటు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రణాళిక బోర్డుని విభజించారు. మూడేళ్ల కాలవ్యవధితో బోర్డు చైర్మన్లను నియమించారు. విజయనగరం కేంద్రంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ.. కాకినాడ కేంద్రంగా ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా..కడప కేంద్రంగా కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు ప్రాంతీయ ప్రణాళికా బోర్డులు పని చేయనున్నాయి.

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అన్ని రంగాల్లో సమానంగా అభివృద్ధి చేయడమే సీఎం జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా 4 ప్రాంతీయ ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రాంతాల మధ్య అసమానతలను రూపు మాపే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సామాజిక అసమానతలతో పాటు మౌలిక వసతుల్లో వ్యత్యాసాలను నివారించడం ద్వారా అన్ని ప్రాంతాల్లో సమాన అవకాశాలను కల్పించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దీనిపై చర్చ సాగుతున్నా.. ఇప్పుడు కార్య రూపం దాల్చింది. కొత్తగా నియమించే ప్రాంతీయ ప్రణాళిక బోర్డులకు ఛైర్మన్లు… వివిధ రంగాల్లో నిపుణులను సభ్యులుగా నియమిస్తారు. 

వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో ప్రాంతీయ డెవలప్ మెంట్ బోర్డులు ఏర్పాటు చేశారు. తెలంగాణతో పాటు రాయలసీమ..ఉత్తరాంధ్ర ప్రాంతాలకు కమిటీని ఏర్పాటు చేసి చైర్మన్లను నియమించారు. వాటికి తగిన విధంగా నిధులు.. విధులు ఖరారు చేయకపోవటంతో అవి ఉద్దేశాలను చేరుకోలేక పోయాయి. ఇప్పుడు జగన్ సీఎం అయ్యాక అన్ని ప్రాంతాలను అన్ని రంగాల్లో సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నాలుగు ప్రాంతీయ ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

Also Read : హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ