YSRCP Manifesto 2024 : వైసీపీ మ్యానిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు

ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద చివరి సిద్ధం సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు 6 పార్లమెంట్ సెగ్మెంట్ల నుంచి జనం భారీగా కదిలి రాబోతున్నట్లుగా తెలిపారు.

YSRCP Manifesto 2024 : వైసీపీ మ్యానిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు

YSRCP Manifesto

YSRCP Manifesto 2024 : ఈ నెల 10న జరిగే సిద్ధం సభా వేదికపై వైసీపీ మ్యానిఫెస్టో ప్రకటిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు సీఎం జగన్ వివరిస్తారని తెలిపారు. అలాగే క్యాడర్ కు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారని తెలిపారు విజయసాయిరెడ్డి. ఇక ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద చివరి సిద్ధం సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు 6 పార్లమెంట్ సెగ్మెంట్ల నుంచి జనం భారీగా కదిలి రాబోతున్నట్లుగా తెలిపారు.

”మనం మ్యానిఫెస్టోలో పొందుపరచబోయే అంశాల గురించి కూడా సీఎం జగన్ సిద్ధం సభలో తెలియజేస్తారు. మేనిఫెస్టో తయారవుతోది. సరైన సమయంలో రిలీజ్ చేస్తారు. ఆఖరి సిద్ధం సభకు 15లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నాం. 100 ఎకరాల స్థలంలో సభ ఉంటుంది. అవసరం అయితే మరో 100 ఎకరాల స్థలం చదును చేసి ఉపయోగించుకుంటాం” అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.

ఇప్పటికే మూడు సిద్ధం సభలను వైసీపీ పూర్తి చేసుకుంది. నాలుగోవది, చివరిది మేదరమెట్లలో జరగబోతోంది. చివరి సభను వైసీపీ అధిష్టానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 6 పార్లమెంట్ సెగ్మెంట్ల నుంచి వైసీపీ కేడర్ ను సమకూర్తి దాదాపు 100 ఎకరాల ప్రాంగణంలో సభ ఏర్పాటు చేస్తున్నారు. 15 లక్షల మంది కార్యకర్తలు, అభిమానులు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వైసీపీ నేతలు వెల్లడించారు. సభకు వచ్చే కేడర్ కు, అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల వివరాలను సభా వేదికగా సీఎం జగన్ ప్రజలకు వివరించబోతున్నారు.

Also Read : వైసీపీలోకి ముద్రగడ..? పిఠాపురంలో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు