ప్లకార్డులు ప్రదర్శించడంపై ఏపీ అసెంబ్లీలో గొడవ

ప్లకార్డులు ప్రదర్శించడంపై ఏపీ అసెంబ్లీలో గొడవ జరిగింది. ప్లకార్డులు లాక్కోవడంపై టీడీపీ నిరసన తెలిపింది.

  • Publish Date - December 12, 2019 / 04:34 AM IST

ప్లకార్డులు ప్రదర్శించడంపై ఏపీ అసెంబ్లీలో గొడవ జరిగింది. ప్లకార్డులు లాక్కోవడంపై టీడీపీ నిరసన తెలిపింది.

ప్లకార్డులు ప్రదర్శించడంపై ఏపీ అసెంబ్లీలో గొడవ జరిగింది. ప్లకార్డులు లాక్కోవడంపై టీడీపీ నిరసన తెలిపింది. ప్లకార్డులు ఇచ్చేసినా మార్షల్స్ తమపై దాడికి ప్రయత్నించారని టీడీపీ ఆరోపించింది. ఎమ్మెల్యేలతో దారుణంగా వ్యవహరించారని వాపోయారు. అవాస్తవాలు చెప్పి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబును 40 నిమిషాలు సభకు రాకుండా ఆపారని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడితో చీఫ్ మార్షల్ దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. 

మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్లకార్డులు తీసుకురాలేదని చెబితే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. సభలో తమకు మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదని వాపోయారు. సభలోకి కనీసం నల్ల రిబ్బన్ ను అనుమతించడం లేదన్నారు. ముఖ్యమైన పేపర్లు కూడా సభలోకి తీసుకురాకూడదా అని అడిగారు. గత ప్రొసీడింగ్స్ కూడా పరిశీలించాలన్నారు.

టీడీపీ నేతలే మార్షల్స్ పై దాడికి దిగారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. సభలో ఏదో ఒక రూపంలో గందగరగోళం సృష్టించడమే టీడీపీ ఉద్దేశమని విమర్శించారు. సభను అడ్డుకోవడమే టీడీపీ వ్యూహం అన్నారు. మూడు రోజులు సభ సజావుగా సాగితే టీడీపీ నేతలకు నచ్చలేదన్నారు. యనమల స్పీకర్ గా ఉన్నప్పుడే నిబంధనలు పెట్టారని తెలిపారు. రూల్స్ ప్రకారమే మార్షల్స్ వ్యవహరించారని తెలిపారు. సభ సజావుగా సాగేందుకు టీడీపీ సహకరించాలని కోరారు.