కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు గాయాలు
నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. సహకార సంఘం చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.

నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. సహకార సంఘం చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.
నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. సహకార సంఘం చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్వల్ప గాయాలు అయ్యాయి. ఇరు పార్టీల కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేసి, వారిని చెదరగొట్టారు.
అమ్రాబాద్ సహకార సంఘం ఛైర్మన్ ఎన్నిక వివాదాస్పదంగా మారింది. అమ్రాబాద్ మండలంలో మొత్తం 13 ఎన్నికలు జరిగాయి. కౌంటింగ్ కూడా పూర్తి అయింది. కాంగ్రెస్ కు సంబంధించిన ఏడుగురు, టీఆర్ఎస్ కు సంబంధించిన ఆరుగురు సభ్యులు విజయం సాధించారు. ఆదివారం (ఫిబ్రవరి 16, 2020) చైర్మన్ ఎన్నిక ఉండటంతో ఇరు పార్టీల సభ్యులు, నేతలంతా సహకార సంఘం కార్యాలయానికి చేరుకున్నారు. స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ కూడా అక్కడికి చేరుకున్నారు.
సహకార సంఘం చైర్మన్ ఎన్నికకు కాంగ్రెస్ రంగం సిద్ధం చేసుకుంది. మరోవైపు సహకార సంఘం చైర్మన్ ఎన్నిక వ్యవహారాన్ని పరిశీలించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తమ సభ్యులు తీసుకెళ్తారని కాంగ్రెస్ సభ్యులు ముందుగా ఆరోపించారు. ఈ క్రమంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది.
ఇద్దరు కీలక నేతలు ఎమ్మెల్యే బాలరాజు, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ అక్కడ ఉండటంతో ఇరు పార్టీల కార్యకర్తలు కేరింతలు, ఈలలు వేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు చేసిన దాడిలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కంటికి స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే ఎమ్మెల్యేను అచ్చంపేట అస్పత్రికి తరలించారు. వైద్యులు అతనికి చికిత్స చేశారు.