ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు : గ్రేటర్‌లో స్లిప్ రోడ్లు

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించి ప్రజలకు సులువైన ప్రయాణం కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. రోడ్లపై ట్రాఫిక్ భారం తగ్గించేలా స్లిప్ రోడ్లను అందుబాటులోకి తేవాలని GHMC అధికారులను అదేశించారు. స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్, కాంప్రహెన్సివ్ రోడ్డు మెయింటనెన్స్ ప్రొగ్రామ్ ద్వారా మౌలిక వసతుల కల్పన పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. పాదాచారులకు ఇబ్బందులు కలగకుండా పనులు నిర్వహించాలని అధికారులకు కేటీఆర్ సూచించారు.
ప్రగతి భవన్లో మేయర్ బోంతు రామ్మోహన్…, కమిషనర్ ఇతర ఉన్నతాదికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి కేటీఆర్. గ్రేటర్‌లో ఫస్ట్ పేజ్ లో 55 స్లిప్ రోడ్లను గుర్తించామని, వాటి నిర్మాణానికి వేగంగా ప్రణాళికలు చేస్తున్నామని అధికారులు మంత్రికి తెలియజేశారు. ఇప్పటికే 40 రోడ్లకు సిద్ధమైందన్నారు. ఇందులో 20 రోడ్లలో కేవలం 90 ఆస్తుల సేకరణ పూర్తి చేస్తే సేకరణ పూర్తిచేస్తే స్లిప్‌రోడ్ ల నిర్మాణం మొదటిదశ ప్రారంభించేందుకు వీలవుతుందన్నారు.
స్ర్టాటెజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ (ఎస్సార్టీపీ), కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ (సీ ఆర్‌ఎంసి) వంటి కార్యక్రమాల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన పెద్దయెత్తున చేపడుతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. దీంతోపాటు అభివృద్ధి ద్వారా కూడళ్ల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేలా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. రోడ్ల వెంబడి పాదచారులు నడిచేందుకు వీలుగా పెద్దయెత్తున ఫుట్‌పాత్‌ల నిర్మాణం కూడా చేపడుతున్నామన్నారు. GHMC బస్‌బేల నిర్మాణం కోసం పలు ప్రాంతాలను గుర్తించామని అన్నారు. ఈ ప్రాంతాల్లో బస్ బేల నిర్మాణం మరింత వేగంగా పూర్తిచేయాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు.
సిటిలో ఇప్పటికే బస్ బేల నిర్మాణం కోసం పలు ప్రాంతాలను GHMC గుర్తించిన అంశాన్ని అధికారులకు మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. బస్సు బేల నిర్మాణం మరింత వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతున్న పనుల వివరాలను కేటీఆర్ ఆరా తీశారు. హైదరాబాద్‌లోని పవర్‌కారిడార్లలో రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి ఒక నివేదిక సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్ GHMC అధికారులను కోరారు.
Read More : నష్టాలను అధిగమించేందుకు : ఎర్రబస్సుల్లో సరుకు రవాణా