Ghulam Nabi Azad political party: నేడు కొత్త పార్టీ పేరును ప్రకటించనున్న గులాం నబీ ఆజాద్?

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఇవాళ కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉంది. నిన్న ఆయన జమ్మూకశ్మీర్ లో తన మద్దతుదారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్త పార్టీ విషయంపై ఆయనను మీడియా ప్రశ్నించింది. దీంతో ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలుపుతానని అన్నారు. జమ్మూకశ్మీర్ ప్రజల అభీష్టానికి అనుగుణంగానే తన పార్టీ పేరు, జెండా ఉంటాయని చెప్పారు.

Ghulam Nabi Azad political party

Ghulam Nabi Azad political party: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఇవాళ కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉంది. నిన్న ఆయన జమ్మూకశ్మీర్ లో తన మద్దతుదారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్త పార్టీ విషయంపై ఆయనను మీడియా ప్రశ్నించింది. దీంతో ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలుపుతానని అన్నారు.

జమ్మూకశ్మీర్ ప్రజల అభీష్టానికి అనుగుణంగానే తన పార్టీ పేరు, జెండా ఉంటాయని చెప్పారు. తన పార్టీ పేరు గురించి ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని అన్నారు. తన పార్టీకి ఓ హిందుస్థానీ పేరు పెడతానని, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునేలా ఆ పేరు ఉంటుందని చెప్పారు. జమ్మూకశ్మీర్ కి మళ్ళీ పూర్తిస్థాయి రాష్ట్ర హోదా వచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. స్థానికులకు భూమి, ఉద్యోగాలు ఇవ్వడంపై దృష్టి పెడతానని చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జమ్మూకశ్మీర్ లో తన పార్టీ మొదటి యూనిట్ ను నెలకొల్పుతానని అన్నారు. తనపై, తన మద్దతుదారులపై విమర్శలు చేస్తూ తనకు చెడ్డ పేరు తీసుకురావాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు. కాగా, రాహుల్ గాంధీని పరిణితి చెందని నేతగా అభివర్ణిస్తూ గులాం నబీ ఆజాద్ విమర్శలు గుప్పిస్తూ కాంగ్రెస్ నుంచి నెల రోజుల క్రితం వైదొలిగారు.

Kishan Reddy slams Kcr: హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక సమయంలో ‘దళిత బంధు’.. ఇప్పుడు ‘గిరిజన బంధు’: కిషన్ రెడ్డి