కాకినాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అధికారం ఇవ్వాలని ఆ పార్టీ చీఫ్ జగన్ కోరారు. వైసీపీ అధికారంలోకి వస్తే అవినీతి లేని, స్వచ్ఛమైన పాలన అందిస్తామన్నారు. సంక్షేమ
కాకినాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అధికారం ఇవ్వాలని ఆ పార్టీ చీఫ్ జగన్ కోరారు. వైసీపీ అధికారంలోకి వస్తే అవినీతి లేని పాలన అందిస్తామన్నారు. సంక్షేమ పథకాలు అందరికి అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. కులమతాలకు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామన్నారు. విలువలు, విశ్వసనీయతకు ఓటేయాలని పిలుపునిచ్చారు. కాకినాడలో వైసీపీ సమరశంఖారావంలో జగన్ మాట్లాడారు.
Read Also : చంద్రబాబు కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే: జగన్
మంగళవారం(మార్చి 12)తో వైసీపీ 9వ సంవత్సరంలోకి అడుగుపెడుతుందని, తొమ్మిదేళ్లుగా ప్రజాసమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటం చేశామని జగన్ అన్నారు. అధికారంలో ఉన్న వాళ్లు వైసీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేశారని జగన్ వాపోయారు. తాము అధికారంలోకి వచ్చాక నమోదైన దొంగ కేసులను ఎత్తివేస్తామన్నారు.
చంద్రబాబు పాలనపై జగన్ ఫైర్ అయ్యారు. ఏపీలో అవినీతి పెరిగిపోయిందన్నారు. రాజధానిలో తాత్కాలిక భవనాలు తప్ప ఏమీ కనిపించవన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్ని కూడా చంద్రబాబు నెరవేర్చలేదన్నారు. రుణాలు మాఫీ చేస్తానని చెప్పి రైతులను మోసం చేశారని అన్నారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఎన్నికలకు 3 నెలల ముందు నిరుద్యోగ భృతి ప్రకటించి నిరుద్యోగులను మోసం చేశారని అన్నారు. చంద్రబాబుని సైబర్ క్రిమినల్ తో జగన్ పోల్చారు.
Read Also : ఇదేంది సారూ : పవన్ కళ్యాణ్‌కు రెండు చోట్ల ఓటు
Read Also : ‘సివిజిల్’ యాప్ :ఎలక్షన్ కంప్లయింట్స్ ఎవరైనా చేయొచ్చు