హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో రివర్స్ టెండరింగ్ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. పోలవరం రివర్స్ టెండరింగ్ కు వెళ్లొద్దని

  • Publish Date - August 22, 2019 / 06:33 AM IST

హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో రివర్స్ టెండరింగ్ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. పోలవరం రివర్స్ టెండరింగ్ కు వెళ్లొద్దని

హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో రివర్స్ టెండరింగ్ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. పోలవరం రివర్స్ టెండరింగ్ కు వెళ్లొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పోలవరం రివర్స్ టెండరింగ్ ను నిలుపుదల చేయాలంది. నవయుగ కంపెనీకి హైడల్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సైతం హైకోర్టు తోసిపుచ్చింది. పోలవరం హైడల్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ రద్దు పిటిషన్ పై విచారించిన కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.

పోలవరం హైడల్(జల విద్యుత్) ప్రాజెక్టు నిర్మాణం కోసం నవయుగ కంపెనీతో జరిగిన ఒప్పందాన్ని ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ నవయుగ ఇంజినీరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ హైకోర్టుని ఆశ్రయించింది. సోమవారం(ఆగస్టు 19,2019) రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మంగళవారం(ఆగస్టు 20,2019) వాదప్రతివాదనలు ముగిశాయి. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు తీర్పును రిజర్వ్ చేశారు. గురువారం(ఆగస్టు 22,2019) తీర్పుని ఇచ్చారు.

కాంట్రాక్ట్ రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా నవయుగ కంపెనీ డైరెక్టర్‌ వై.రమేష్‌ అనుబంధ వ్యాజ్యాలను హైకోర్టులో దాఖలు చేశారు. ప్రభుత్వం అర్థంతరంగా ఒప్పందాన్ని రద్దు చేసిందని, రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లే పేరుతో తమ కాంట్రాక్టు రద్దు చేయడం చట్ట వ్యతిరేకమని పిటిషనర్‌ తరఫు సీనియర్‌ లాయర్‌ వాదించారు. ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందాన్ని ఆగస్టు 14న రద్దు చేస్తూ జెన్‌కో (హైడల్‌ ప్రాజెక్ట్‌) చీఫ్‌ ఇంజినీర్‌ జారీ చేసిన ఉత్తర్వుల్ని రద్దు చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ వద్దన్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టి కాంట్రాక్టును రద్దు చేసిందని వాదించారు.

పవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని చూపించాల్సింది ప్రభుత్వమేనని, స్థలాన్ని ప్రభుత్వం చూపనందునే నిర్మాణాన్ని ప్రారంభించలేదన్నారు. పేరు ప్రతిష్టలు ఉన్న కంపెనీ తప్పు చేయకపోయినా ప్రభుత్వం ఏకపక్షంగా కాంట్రాక్టును రద్దు చేస్తూ జీవో ఇవ్వడం చెల్లదన్నారు. ఏపీ జెన్‌కోతో ఒప్పందం చేసుకున్నప్పటి నుంచి..కాంట్రాక్ట్ విషయంలో తాము ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడ లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు నవయుగ సంస్థ తరపు లాయర్. 2021 నవంబర్ వరకు కాంట్రాక్ట్ గడువు ఉందన్నారు. 

స్దలం చూపించ లేదని కాంట్రాక్ట్ రద్దు చేయకూడదని ఎలా అంటారని ప్రభుత్వ లాయర్ తన వాదనలు వినిపించారు. రద్దు చేస్తే ఆర్బిటరేషన్‌కి వెళ్లాలి.. హైకోర్టును ఆశ్రయించడం సరికాదన్నారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియలో ఎలాంటి పురోగతి లేదని.. రివర్స్ టెండరింగ్ కొనసాగించాలని కోర్టును కోరారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు.. ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుపట్టింది.

Also Read : సీఎం జగన్ కీలక నిర్ణయం