హుజూర్ నగర్ ఉపపోరు ఆసక్తికరంగా మారింది. ఉపఎన్నికలో గెలుపు కోసం అన్ని పార్టీలో వ్యూహారచనలు చేస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించాయి.
హుజూర్ నగర్ ఉపపోరు ఆసక్తికరంగా మారింది. ఉపఎన్నికలో గెలుపు కోసం అన్ని పార్టీలో వ్యూహారచనలు చేస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ సైతం అభ్యర్థిని అనౌన్స్ చేసింది. అభ్యర్థి ఎంపిక విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఊహించని విధంగా మహిళను బరిలోకి దింపింది. హుజూర్ నగర్ ఉపఎన్నిక బీజేపీ అభ్యర్థిగా శ్రీకళారెడ్డిని దాదాపుగా ఖరారు చేశారు. శ్రీకళారెడ్డి.. ఈ మధ్యే టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. శ్రీకళారెడ్డి తండ్రి జితేందర్‌రెడ్డి గతంలో హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. శ్రీకళారెడ్డి భర్త ధనుంజయ్ సింగ్ బీఎస్పీ తరపున 2009లో ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేశారు. టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ పద్మావతి రెడ్డి బరిలోకి దిగనున్నారు. ఇప్పుడు బీజేపీ కూడా అభ్యర్థిని ఖరారు చెయ్యడంతో హుజూర్ నగర్ ఉపపోరు రసవత్తరంగా మారింది.