వచ్చేది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వమే : జగన్
రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ అన్నారు. అదిగో ఉద్యోగం.. ఇదిగో ఉద్యోగమని చంద్రబాబు ఊరించారని తెలిపారు.

రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ అన్నారు. అదిగో ఉద్యోగం.. ఇదిగో ఉద్యోగమని చంద్రబాబు ఊరించారని తెలిపారు.
ప్రకాశం : రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ అన్నారు. అదిగో ఉద్యోగం.. ఇదిగో ఉద్యోగమని చంద్రబాబు ఊరించారని తెలిపారు. 2.30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదని విమర్శించారు. ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్న ఉద్యోగాలను పీకేశారని తెలిపారు. కోచింగ్ ల కోసం విద్యార్థులు వేలకు వేల రూపాయలు ఖర్చు చేశారని తెలిపారు. జాబు రావాలంటే బాబు పోవాలని అన్నారు. గిద్దలూరులో ఎన్నికల ప్రచారంలో జగన్ ప్రసంగించారు. టీడీపీ పాలనలో యువత, మహిళలు, రైతులు బాగుపడ్డారా.. చంద్రబాబు బాగుంటే రాష్ట్రం బాగున్నట్లా అని ప్రశ్నించారు.
Read Also : అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లో రుణ మాఫీ : రాహుల్ గాంధీ
అందరికీ అండగా ఉంటానని జగన్ హామీ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేస్తామని చెప్పారు. ప్రతి ఏడాది జనవరిలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పారు. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా చట్టం తెస్తానని చెప్పారు. ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు పెట్టి ఉద్యోగ శిక్షణ ఇస్తామన్నారు. ప్రభుత్వ రంగ కాంట్రాక్టుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇస్తామని చెప్పారు.
ఎన్నికలు దగ్గరపడే కొద్దీ చంద్రబాబు అనేక అబద్ధాలు చెబుతున్నారని తెలిపారు. గ్రామాలకు మూటలు మూటలు డబ్బులు పంపుతారని ఆరోపించారు. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేల కోసం మోసపోవ్దదన్నారు. కొన్ని రోజులు ఓపిక పడితే వచ్చేది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు.
Read Also : ఎయిర్ పోర్ట్ పేరు మార్చాలి…విమానంలో పార్టీ అధ్యక్షుడు నిరసన