Pawan Kalyan : కోనసీమను ఎడారిగా మార్చేస్తున్నారు, రైతులను దోచుకుంటున్నారు- పవన్ కల్యాణ్

Pawan Kalyan : రైతులేమీ ఇసుక దోపిడీలు, వ్యాపారాలు చెయ్యడం లేదు. నష్టపోయిన రైతులను మంత్రులు ఆదుకోకుండా అనరాని మాటలు అంటున్నారు.

Pawan Kalyan : ఏపీ ప్రభుత్వంపై జనసేనాని పవన్ కల్యాణ్ పైర్ అయ్యారు. రైతులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం విఫలమైందని పవన్ మండిపడ్డారు. రాజమండ్రిలో రైతులతో మాట్లాడిన పవన్ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంగళగిరికి వెళ్లారు. అక్కడ జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. నిన్నటి పర్యటనలో 5 నియోజకవర్గాల రైతులతో మాట్లాడానని తెలిపారు. అకాల వర్షాలు వస్తే ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదని రైతులు చెప్పారని పవన్ అన్నారు.

వ్యవసాయ శాఖ యాక్టివ్ గా లేదని చెప్పారు, దళారీ వ్యవస్థ వల్ల ఎక్కువ నష్టపోతున్నామని చెప్పారు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు దూరంగా ఉన్నాయని వాపోతున్నారు, దూరం ప్రయాణం చెయ్యాలని అంటే ఎక్కువ నష్టపోతున్నామని రైతులు తనతో ఆవేదన వ్యక్తం చేశారని పవన్ తెలిపారు. ఈ ప్రభుత్వం రైతులకు కనీసం గోనె సంచులు కూడా ఇవ్వడం లేదన్నారు. నేను వెళ్తున్నాను అనగానే సంచులు ఇచ్చారని విమర్శించారు.

Also Read..Pawan Kalyan : సీఎం పదవి, పొత్తులపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

” రైతులేమీ ఇసుక దోపిడీలు, వ్యాపారాలు చెయ్యడం లేదు. నష్టపోయిన రైతులను మంత్రులు ఆదుకోకుండా అనరాని మాటలు అంటున్నారు. వ్యవసాయ వ్యవస్థను బలోపేతం చెయ్యకుండా ఇబ్బందులకు గురిచేస్తారు. మద్దతు ధర ఇవ్వాలని నోరెత్తి అడిగితే అక్రమ కేసులు పెడుతున్నారు. మాకు రుణ మాఫీ వద్దు పంటకు 25వేలు పావలా వడ్డీతో ఇస్తే చాలు అంటున్నారు.

కాలువల్లో పూడికలు కూడా తియ్యడం లేదు. నేను వెళ్తున్నాను అనగానే బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేశారు. బ్యాంకుకి వెళ్తే పడిన డబ్బులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైస్ పంటకు పేరొందిన కోనసీమను ఎడారిగా మార్చేస్తున్నారు. చివరి ధాన్యం గింజకు పరిహారం వచ్చే వరకూ పోరాటం చేస్తాం, అండగా ఉంటాం. రైతులు అబద్దాలు చెప్పరు కదా? సమస్య ఉన్న చోటే నేను మాట్లాడతా” అని పవన్ కల్యాణ్ అన్నారు.

Also Read..Paritala Sriram : వైసీపీ నాయకుని ఇంటి కోసం అమాయకుడి గుడిసె కూల్చేస్తారా..? మా ప్రభుత్వం వచ్చాక మీ ఇంట్లోంచి రోడ్లు వేస్తాం జాగ్రత్త..

”ఒక్క మంత్రి అయినా రైతులకు సహాయపడకపోగా అనుచిత మాటలు అనడం బాధ కలిగించిందన్నారు పవన్. “మేం అన్నం పెడుతున్నాం. మాకేంటి ఈ బాధలు? మేం ఏమైనా నేరస్తుల్లా కనిపిస్తున్నామా? అని రైతులు ఆక్రోశిస్తున్నారు. ఎమ్మార్వో, కలెక్టర్ ఆఫీసులకు వెళ్లి రైతులు తమ గోడు వెళ్లబోసుకునే పరిస్థితి లేదు. వారిని అదుపులోకి తీసుకుని ఎక్కడికో తీసుకెళ్లి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలిపెడుతున్నారు” అని పవన్ వాపోయారు.

ట్రెండింగ్ వార్తలు