Nadendla Manohar Slams CM Jagan
Nadendla Manohar : ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. ప్రభుత్వ సలహాదారులు, వారికి ఇచ్చే జీతభత్యాలపై నాదెండ్ల మనోహర్ సీరియస్ అయ్యారు. ఏపీ ప్రభుత్వానికి ఇంతమంది సలహాదారులు అవసరమా? అని నాదెండ్ల మనోహర్ అడిగారు. ఇష్టానుసారంగా సీఎం జగన్ సలహాదారులను నియమించారని ధ్వజమెత్తారు. సలహాదారుల కోసం ఏపీ ప్రభుత్వం రూ.48 కోట్లు ఖర్చు పెట్టిందని ఆయన చెప్పారు. సలహాదారుడిని స్పెషల్ కేటగిరీ కింద నియమించి క్యాబినెట్ మినిస్టర్ హోదా ఎలా కల్పిస్తారు? అని జగన్ సర్కార్ ను ఆయన నిలదీశారు. సలహాదారులు, వారి జీతాల విషయంలో జీవోలను రహస్యంగా ఉంచడంలో ఆంత్యరం ఏమిటో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నాదెండ్ల మనోహర్.
” సలహాదారుల జీతాల కోసం బడ్జెట్ లో 29 కోట్ల 61లక్షల రూపాయలు కేటాయించాం అని చెప్పారు. ట్విట్టర్ లో పెట్టిన పోస్టులో ఇప్పటివరకు ఖర్చు పెట్టింది 48 కోట్ల 33లక్షల రూపాయలు అని చెప్పారు. ఇక్కడే మీ డొల్లతనం బయటపడింది. ముందు మీరు ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. ఒక్క ఏడాదిలోనే 29 కోట్ల 61లక్షలు బడ్జెట్ లో పొందుపరిచాము అని చెబుతుంటే.. మీరే ఈ ఐదు సంవత్సరాలు 48 కోట్లు ఖర్చు పెట్టామని చెబుతున్నారు. కమ్యూనికేషన్స్ కోసం ఒక అడ్వైజర్ ను నియమించారు. జీవోలన్నీ ఎవరికీ దొరక్కుండా దాచిపెట్టారు. ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే ఆయనను అపాయింట్ చేసుకున్నారు.
Also Read : ఏపీ రాజకీయాలపై ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు.. వైసీపీకి ఆ ఏరియాల్లో వ్యతిరేకత తప్పదట
మన రాష్ట్రంలో కేబినెట్ మంత్రి బేసిక్ పే 14వేల రూపాయలు. స్పెషల్ అడ్వైజర్ కు కూడా 14వేలు. కానీ, ఈయన పని తీరు చూసి జీతం పెంచారట. ఈ జీవో ప్రకారం ఆయన జీతం నెలకు 2లక్షలు. 14వేల జీతం ఇవ్వాల్సింది పోయి 2లక్షలు ఇస్తున్నారు. ఇది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు (2.80లక్షలు) ఇచ్చే జీతంతో సమానం. హైకోర్టు జడ్జికి (2.25లక్షలు) ఇచ్చే జీతంతో సమానం. సుమారు 26 లక్షలు ప్రత్యేకంగా అందించింది ప్రభుత్వం. ఇది బరి తెగింపు కాదా? ఏ విధంగా ఆ సలహాదారుకి అంత భారీ జీతం ఇస్తున్నారు? ఏ విధంగా ఆయనను స్పెషల్ కేటగిరీ కింద పెట్టి కేబినెట్ మినిస్టర్ హోదా కల్పించారు?” అని నాదెండ్ల మనోహర్ నిలదీశారు.
Also Read : మళ్లీ అలిగిన ఎంపీ వేమిరెడ్డి.. ఏం జరుగుతుందో తెలుసా?