పవన్ కు షాక్ ఇచ్చిన జనసేన ఎమ్మెల్యే : సీఎం జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారు

ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియంపై జనసేన పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇంగ్లీష్ మీడియాన్ని జనసేనాని పవన్ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. మాతృభాష

  • Publish Date - December 11, 2019 / 06:28 AM IST

ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియంపై జనసేన పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇంగ్లీష్ మీడియాన్ని జనసేనాని పవన్ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. మాతృభాష

ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియంపై జనసేన పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇంగ్లీష్ మీడియాన్ని జనసేనాని పవన్ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. మాతృభాష తెలుగుకి అన్యాయం జరుగుతుందని వాపోయారు. తెలుగుని పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలుగుని బతికించుకోవాలంటే ఇంగ్లీష్ మీడియం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పవన్ వైఖరి ఇలా ఉంటే.. జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం మరోలా స్పందించారు. ఇంగ్లీష్ మీడియం విషయంలో పవన్ కు షాక్ ఇచ్చారు.

ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం అంశం గురించి ఏపీ అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.. ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియాన్ని స్వాగతించారు. పేద విద్యార్థుల కోసం సీఎం జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. చంద్రబాబు మధ్యలో వదిలేసిన ఇంగ్లీష్ మీడియాన్ని జగన్ ప్రభుత్వం కొనసాగించే ప్రయత్నం చేస్తోందన్నారు. ఇంగ్లీష్ మీడియం వల్ల బలహీనవర్గాలకు మేలు జరుగుతుందన్నారు. ఈ పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ మీడియం మంచిదే అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకి చాలా అనుభవం ఉందని, స్పీకర్ ను గౌరవించాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. 

”ప్రభుత్వ స్కూల్స్ లో చదువుకునే విద్యార్థులంతా దళితులు. పేదవారు మాత్రమే ప్రభుత్వ స్కూల్స్ లో చదివే పరిస్థితి ఉంది. ప్రభుత్వ స్కూల్స్ లో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం.. మంచిది. చంద్రబాబు కూడా గతంలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టేందుకు ప్రయత్నం చేశారు. ఆయన చేసిన ప్రయత్నమే ఇవాళ జగన్ చేస్తున్నారు. మరి ఎందుకు అడ్డు చెబుతున్నారు? తూర్పుగోదావరి నుంచి బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. కూలిపనులు చేసుకుంటున్నారు. ఇంగ్లీష్ లో చదువుకోవడం వల్ల పిల్లల జీవితాలు బాగుపడతాయి. ఉద్యోగాలు వస్తాయి. సీఎం జగన్ మంచి అవకాశాన్ని ఇస్తుంటే దాన్ని వ్యతిరేకించడం మంచిపద్దతి కాదు. స్పీకర్ చైర్ కి గౌరవం ఉంది. దాన్ని అవమానించడం కరెక్ట్ కాదు. సుదీర్ఘ అనుభవమున్న చంద్రబాబు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు” అని రాపాక అన్నారు.

ఇంగ్లీష్ మీడియం విషయంలో పవన్ ఒకలా, జనసేన ఎమ్మెల్యే మరోలా మాట్లాడటం జనసేనవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పవన్ వ్యతిరేకిస్తుంటే.. రాపాక స్వాగతించారు. జగన్ సర్కార్ ను సపోర్ట్ చేస్తూ రాపాక చేసిన వ్యాఖ్యలు, ఆయన తీరు జనసేన పార్టీలో కలకలం రేపాయి. రాపాక జనసేనను వీడతారనే ప్రచారం మరోసారి తెరపైకీ వచ్చింది.